వచ్చే నెలలో శ్యామ్‌సంగ్ వేవ్ 3

Posted By: Staff

వచ్చే నెలలో శ్యామ్‌సంగ్ వేవ్ 3

శ్యామ్‌సంగ్ స్మార్ట్ పోన్స్ బడా ఆపరేటింగ్ సిస్టమ్‌‌తో మార్కెట్లోకి విడుదలై మంచి బిజినెస్‌ని రాబడుతున్న విషయం తెలిసిందే. కొరియా ఎలక్ట్రానిక్స్ గెయింట్ అయిన శ్యామ్‌సంగ్ మొబైల్స్ త్వరలో శ్యామ్‌సంగ్ వేవ్ 3ని విడుదల చేసి స్మార్ట్ పోన్ మార్కెట్లో తిరిగి చరిత్రను తిరగరాయాలని చూస్తుంది. శ్యామ్‌సంగ్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ బడాతో వచ్చే నెలలో శ్యామ్‌సంగ్ వేవ్ 3ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. శ్యామ్‌సంగ్ వేవ్ సిరిస్ మొబైల్స్ మొబైల్ మార్కెట్లో బాగా హిట్ అయిన సంగతి తెలిసిందే. దానిని కస్టమర్స్ నుండి క్యాష్ చేసుకునేందుకు గాను మార్కెట్లోకి శ్యామ్ సంగ్ వేవ్ 3ని ప్రవేశపెట్టనున్నట్లు ఆసిమ్ వర్షి(డైరెక్టర్ ఆప్ మార్కెటింగ్, మొబైల్ బిజినెస్, శ్యామ్‌సంగ్) తెలిపారు.

శ్యామ్‌సంగ్ వేవ్ 3లో చాలా కొత్త ఫీచర్స్‌ని యాడ్ చేయడం జరిగింది. బడా ఆపరేటింగ్ సిస్టమ్‌ని అప్ గ్రేడ్ చేయడం వల్ల గ్రాఫిక్ సపోర్ట్ ఫీచర్స్‌తో పాటు ఇతర మల్టీ మీడియా అప్లికేషన్స్ కూడా కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది. శ్యామ్‌సంగ్ వేవ్ 3 డ్యూయల్ కొర్ ప్రాసెసర్‌ని కలిగి ఉండి, గతంలో ఉన్న వేవ్ సిరిస్‌లతో పొల్చితే స్క్రీన్ సైజు డిస్ ప్లే చాలా పెద్దదిగా రూపోందించడం జరిగింది. శ్యామ్‌సంగ్ వేవే 2లో ఉన్న ఫీచర్స్‌ని ఒక్కసారి గమనించినట్లైతే 1GHz ప్రాసెసర్ ఇంటర్నల్ గా మొబైల్‌తో పాటు 3జిబీ మొమొరీ, స్క్రీన్ సైజు 3.7 ఇంచ్‌గా ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 5 మెగా ఫిక్సల్ కమెరాని కలిగి ఉండి యూజర్స్‌కు చక్కని ఇమేజి ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుంది.

ఇక శ్యామ్‌సంగ్ వేవ్ 3 ఫీచర్స్ విషయానికి వస్తే మల్టీ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి, ప్రాక్సిమిటీ సెన్సార్స్ ప్రత్యేకం. కెమెరా కూడా చాలా అత్యాధునికమైనదిగా అమర్చడం జరిగింది. అంతేకాకుండా కెమెరాకి ఆటో ఫోకస్, ఫేస్ అండ్ స్మైల్ డిటెక్షన్‌తో పాటు జియో టాగింగ్ అదనం. మొబైల్‌తో పాటు అనుసంధానమైన బ్రౌజర్ ఢాల్పిన్ 2.0 ఆన్ లైన్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ మొదలగున వాటిని చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పైలను సపోర్ట్ చేస్తాయి. ఇక మొబైల్‌తో పాటు మొమొరీ రాగా, మొమొరీని ఎక్పాండ్ చేసుకునేందుకు గాను మొబైల్‌లో మైక్రో ఎస్‌డి కార్డు పోందుపరచడం జరిగింది. ఇది 32 జిబీ వరకు సపోర్ట్ చేస్తుంది. గతంలో విడుదలైన శ్యామ్‌సంగ్ వేవ్ 2కి దగ్గరగా దీని ధర ఉన్నప్పటికీ కొంచెం ఎక్కువే చెప్పాలి. వచ్చే నెలలో మార్కెట్లోకి విడుదల అవుతున్న శ్యామ్‌సంగ్ వేవ్ 3 ధర సుమారుగా రూ 15,000 నుండి 20,000 వరకు ఉండవచ్చునని నిపుణుల అంచనా...

Samsung Wave 3 Features & Specifications:

* Full touchscreen display
* Samsung Bada OS
* 8 Megapixel camera
* Internal memory
* Expandable memory upto 32GB
* Multiformat Video/Audio player
* 3.5mm audio jack
* WAP/GPRS
* Touch display screen
* Camera: 8.0 MP
* Up to 32 GB Expandable Memory
* Multi Format Audio Player – Yes
* Video Player – Yes
* Bluetooth 2.1 A2DP
* mini USB port
* HDMI port
* Wireless LAN Wi-Fi

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot