'బడా 2.0 ఓఎస్' తో 'శాంసంగ్ వేవ్ 3'

Posted By: Super

'బడా 2.0 ఓఎస్' తో 'శాంసంగ్ వేవ్ 3'

శాంసంగ్  నాణ్యమైన స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తుందని ఇప్పటికే చాలా మంది మొబైల్ అభిమానుల నమ్మకం. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా శాంసంగ్ మార్కెట్లోకి నాణ్యమైన, సాంకేతిక ఉత్పత్తులను ప్రవేశపెడుతుంది. శాంసంగ్ కొత్తగా రూపొందించిన బడా 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌ని త్వరలో విడుదల చేయనున్న 'శాంసంగ్ వేవ్ 3'లో నిక్షిప్తం చేయనుందని సమాచారం.

ఇక శాంసంగ్ వేవ్ 3 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్‌ని గనుక గమనించినట్లేతే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 4.0 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. దీని డిస్ ప్లే కూడా WVGA Super AMOLED టెక్నాలజీతో రూపొందించారు. పవర్ పుల్ ఫెర్పామెన్స్ అందించేందుకు గాను ఇందులో 1.4 GHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇక మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఇమేజిలను తీయవచ్చు.

ఇందులో 512 MB of RAMని నిక్షిప్తం చేశారు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 4GB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ కొసం వై - పై, జిపిఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇక బడా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే హై ఫెర్పామెన్స్‌ని డెలివరి చేస్తుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బడా ఆపరేటింగ్ సిస్టమ్ శాంసంగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఐతే శాంసంగ్ మాత్రం తనయొక్క స్మార్ట్ ఫోన్స్‌లలో బడాతో పాటు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను కూడా ప్రమోట్ చేయడం విశేషం.

శాంసంగ్ వేవ్ 3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు:

* జనరల్: GSM 850/900/1800/1900 MHz, UMTS 900/2100 MHz, EDGE

* ఫామ్ ఫ్యాక్టర్: Touchscreen bar

* చుట్టుకొలతలు: 125.9 x 64.2 x 9.9mm, 122g

* డిస్ ప్లే : 4" 16M-color SuperAMOLED capacitive touchscreen with 480 x 800 pixels resolution

* ఆపరేటింగ్ సిస్టమ్: Bada OS 2.0

* సిపియు: 1.4 GHz processor

* మెమరీ: 4GB user accessible internal memory, microSD card slot

* కెమెరా: 5-megapixels auto-focus camera with LED flash, 720p video recording @30fps

* కనెక్టివిటీ: Wi-Fi 802.11 b/g/n, Bluetooth 3.0 with A2DP

* బ్యాటరీ: 1500 mAh battery

* జిపిఎస్ : GPS receiver with A-GPS

* ఆడియో జాక్ : 3.5mm audio jack

త్వరలో మొబైల్ మార్కెట్లోకి రానున్న 'శాంసంగ్ వేవ్ 3' మొబైల్ ధరని ఇంకా మార్కెట్లో ప్రవేశపెట్ట లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot