శ్యామ్‌సంగ్ వేవ్ సిరిస్‌లో మరో రెండు కొత్త మొబైల్స్

Posted By: Super

శ్యామ్‌సంగ్ వేవ్ సిరిస్‌లో మరో రెండు కొత్త మొబైల్స్

మూడవ జనరేషన్ మొబైల్స్‌ విభాగంలో శ్యామ్‌సంగ్ విడుదల చేసిన వేవ్ సిరిస్ మొబైల్స్ మార్కెట్లో బాగా సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. అదే శ్యామ్‌సంగ్ వేవ్ సిరిస్‌లో మరో రెండు కొత్త మొబైల్స్‌ని విడుదల చేయడానికి శ్యామ్‌సంగ్ సన్నాహాలు చేస్తుంది. ఆ రెండు మొబైల్స్ పేర్లు శ్యామ్‌సంగ్ వేవ్ 3, శ్యామ్‌సంగ్ వేవ్ ఎమ్. శ్యామ్‌సంగ్ త్వరలో విడుదల చేయనున్న ఈ రెండు హ్యాండ్ సెట్స్ కూడా 2జీ, 3జీ నెట్ వర్క్‌లను సపోర్ట్ చేయనున్నాయి.

శ్యామ్‌సంగ్ వేవ్ 3, శ్యామ్‌సంగ్ వేవ్ ఎమ్ రెండు మొబైల్స్ బరువు సుమారుగా 122 గ్రాములు. కానీ వీటి చుట్టుకొలతలు మాత్రమే కొంచెం తేడా ఉన్నాయి. వేవ్ 3 చుట్టుకొలతలు 125.9 x 64.2 x 9.9 mm ఉండగా, వేవ్ ఎమ్ చుట్టుకొలతలు 113.8x63.3x12.2 mmగా ఉన్నాయి. ఇక రెండు మొబైల్స్‌లలో చూసేందుకు శ్యామ్‌సంగ్ వేవ్ ఎమ్‌తో పోల్చితే శ్యామ్‌సంగ్ వేవ్ 3 బెటర్‌గా ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా శ్యామ్‌సంగ్ కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ బడా 2.0 వర్సన్‌తో రన్ అవుతాయి. శ్యామ్‌సంగ్ వేవ్ ఎమ్ మొబైల్ ఫోన్‌లో 832 MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయగా, అదే శ్యామ్‌సంగ్ వేవ్ 3లో 1.4 GHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను శ్యామ్‌సంగ్ వేవ్ ఎమ్ మొబైల్ 4 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉండగా, అదే శ్యామ్‌సంగ్ వేవ్ 3 మొబైల్ మాత్రం 3.6 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉంది. రెండు మొబైల్స్ కూడా కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఫెసిలిటీతో పాటు వేవ్ 3ని Super AMOLED స్క్రీన్‌తో రూపొందించగా, అదే వేవ్ ఎమ్‌ని గొరిల్లా గ్లాస్‌తో రూపోందించడం జరిగింది. రెండు మొబైల్స్ కూడా 5 మెగా ఫిక్సల్‌తో పాటు ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ప్లాష్ ఫీచర్స్‌ని కలిగి ఉన్నాయి. ఇక వీడియో కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకు రావడానికి గాను మొబైల్స్ ముందు భాగంలో విజిఎ కెమెరాని అమర్చడం జరిగింది.

శ్యామ్‌సంగ్ వేవ్ 3, శ్యామ్‌సంగ్ వేవ్ ఎమ్ రెండు మొబైల్స్‌లలో కూడా మల్టీ టచ్ ఇన్ పుట్ ఫీచర్ TouchWiz User Interfaceని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్స్‌తో పాటు 150 ఎమ్‌‌బి ఇంటర్నల్ మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులు బాటు ఉంది. మొబైల్ బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికి వస్తే శ్యామ్‌సంగ్ వేవ్ ఎమ్‌లో 1350 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయగా, అదే శ్యామ్‌సంగ్ వేవ్ 3లో 1500 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

ఇక ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. కమ్యూనికేషన్, కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్, WiFi, GPS లను సపోర్ట్ చేస్తాయి. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న శ్యామ్‌సంగ్ వేవ్ ఎమ్ మొబైల్ ఖరీదు, శ్యామ్‌సంగ్ వేవ్ 3తో పోల్చితే కొంచెం తక్కువ. ఇండియన్ మొబైల్ మార్కెట్లో శ్యామ్‌సంగ్ వేవ్ ఎమ్ మొబైల్ ధర సుమారుగా రూ 16, 000 ఉండగా, అదే శ్యామ్‌సంగ్ వేవ్ 3 మొబైల్ ధర సుమారుగా రూ 20,000 వరకు ఉండవచ్చునని అంచనా..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot