నలుపు రంగులో డిజైన్ కాబడి, అదరగొట్టేందుకు రె‘ఢీ’..?

Posted By: Super

నలుపు రంగులో  డిజైన్ కాబడి, అదరగొట్టేందుకు రె‘ఢీ’..?

 

శ్యామ్‌సంగ్  ఓ సరికొత్త మొబైల్‌ను డిజైన్ చేసింది. దాని పేరు ‘శ్యామ్‌సంగ్ వేవ్ M’, ఈ వర్షన్ లో  ఇదివరకే విడుదలైన  ‘వేవ్  723 మోడల్’కు ఈ తాజా  మోడల్ అప్‌గ్రేడ్ వర్షన్‌గా భావించవచ్చు...

నలుపు రంగులో  డిజైన్ కాబడ్డ ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి స్థాయి ప్రొఫెషనల్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ నాణ్యమైన చిత్రాలను తీసకునేందుకు ఉపకరిస్తుంది. టచ్ ఆధారితంగా ఈ మొబైల్ పని చేస్తుంది. ఇట్టే స్పందిచే టచ్‌విజ్ ఇంటర్‌ఫేస్ వ్యవస్థను ఫోన్లో నిక్షిప్తం చేశారు.

వేగవంతమైన ఇంటర్నెట్ వర్కింగ్‌కు  కొత్త వర్షన్ డాల్ఫిన్ వెబ్ బ్రౌజర్‌ను మొబైల్‌లో అనుసంధానం చేశారు. 832 MHz ప్రాసెసింగ్  మొబైల్  పని వేగాన్ని ఏ మాత్రం తగ్గకుండా చూస్తుంది. డేటాను వేగవంతంగా రవాణా చేసే విధంగా  పొందుపరిచిన  వై-ఫై, బ్లూటూత్, A-GPS వంటి  కనెక్టువిటీ  అంశాలు  వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో లాంఛ్ కాబోతున్న ‘శ్యామ్‌సంగ్ వేవ్  M’ ధర రూ.12,000 పై చిలుకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ముఖ్య ఫీచర్లు: 3.65 అంగుళాల డిస్‌ప్లే, బడా ఆపరేటింగ్ సిస్టం, 832 MHz ప్రాసెసింగ్ వ్యవస్థ,  టచ్‌విజ్ ఇంటర్ ఫేస్ వ్యవస్థ, డాల్ఫిన్ వెబ్ బ్రౌజర్, హై‌స్పీడ్ డౌన్‌లింక్ ప్యాకెట్ యాక్సిస్, 3జి సౌలభ్యత, స్టాండ్ బై టైమ్ 20 రోజులతో 6 గంటల 30 నిమిషాల బ్యాకప్ నందించే 1350 mAh బ్యాటరీ వ్యవస్థ, 5 మెగా పిక్సల్ కెమెరా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot