ఒక మొబైల్‌లో ఇన్ని ప్రత్యేకతలా.. 'వావ్'

Posted By: Super

ఒక మొబైల్‌లో ఇన్ని ప్రత్యేకతలా.. 'వావ్'

నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసి ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్స్‌ని సంపాదించుకున్న మొబైల్ తయారీదారు శ్యామ్‌సంగ్ . అలాంటి శ్యామ్‌సంగ్ అమ్ములపోది నుండి మార్కెట్లోకి మరో కొత్త సూపర్ ఫోన్ రానుంది. ప్రస్తుతం మార్కెట్లో హాట్ టాఫిక్‌గా మాట్లాడుకుంటున్న మొబైల్ ఫోన్ 'శ్యామ్‌సంగ్ వెంబ్లీ' విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్. మొబైల్ ఫోన్‌ని చూడగానే ఇట్టే ఆకర్షించే అందం వెంబ్లీ సొంతం.

కొత్త మొబైల్స్ ఫోన్‌ని ఆహ్వానించే ప్రతి ఒక్కరూ కూడా వెంబ్లీ మొబైల్‌ని చూస్తే వావ్ అని ఖచ్చితంగా అంటారు. అంత అందమైన అందం వెంబ్లీ సొంతం. కొత్తగా రూపొందించిన మైక్రోసాప్ట్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవడమే వెంబ్లీ ప్రత్యేకత. శ్యామ్‌సంగ్ వెంబ్లీ‌లో ఉన్న అన్ని ఫీచర్స్ కూడా ప్రత్యేకతను సంతరించుకున్నవే. శ్యామ్‌సంగ్ వెంబ్లీ యొక్క డిస్ ప్లే 480/800 ఫిక్సల్‌ రిజల్యూషన్‌తో పాటు AMOLED టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. ఇకపోతే దీనియొక్క టచ్ స్క్రీన్ సైజు 3.7 ఇంచ్‌గా రూపొందించబడింది.

వెంబ్లీలో మరో ప్రత్యేకత ఏమిటంటే హై క్లారిటీ డిజిటల్ ఇమేజీలను సపోర్ట్ చేస్తుంది. దీనియొక్క ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో పవర్ పుల్ సింగిల్ కొర్ ప్రాసెసర్ 1.5 GHz క్వాలికామ్ MSM8255ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇక మొబైల్ వెనుక భాగంలో ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో మనకు నచ్చిన విధంగా హై డెఫినేషన్ ఇమేజిలను తీయవచ్చు. ఇందులో ఉన్న కెమెరాకు ఎల్‌ఈడి ఫ్లాష్, ఆటోఫోకస్ ప్రత్యేకం. ఇక మొబైల్ ముందు భాగంలో ఉన్న విజిఎ కెమెరా సహాయంతో వీడియో కాల్స్‌ని అందుబాటులోకి తేవచ్చు.

కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్‌, వై-పై(Wi- Fi b/g/n)లను సపోర్ట్ చేస్తుంది. సరదాగా ప్రయాణాలలో పాటలను వినేందుకు గాను ఇందులో ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. దీనితో పాటు బయట స్పీకర్స్‌కు మొబైల్‌ని కనెక్టు చేసేందుకు గాను 3.5 mm ఆడియో స్టీరియో జాక్ ప్రత్యేకం. మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది.

ఇన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్న వెంబ్లీ మొబైల్‌ని అక్టోబర్ మద్యలో విడుదల చేయడానికి శ్యామ్‌సంగ్ సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించిన ధరను ఇంకా మార్కెట్లో వెల్లడించ లేదు. శ్యామ్‌సంగ్ వెంబ్లీ మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా..

శ్యామ్‌సంగ్ వెంబ్లీ మొబైల్ ప్రత్యేకతలు:

* 2G Network: GSM 850, 900, 1800, 1900 MHz
* 3G Network: HSPA 850, 1900 MHz
* Weight : 121 Grams
* Display Type : Super AMOLED Plus Touchscreen
* Size : 3.7-inch
* Colors & Resolution :16M Colors & – 480 X 800 pixels
* Input/ User Interface: Multi Touch, Proximity & Accelerometer Sensors, Touch-sensitive controls
* System Properties: Operating System, Windows Phone 7.5 Mango OS
* CPU: 1.5 GHz Single-Core Qualcomm MSM8255 Processor
* Internal Memory: 16GB/32GB Internal Memory Storage
* Browser & Messaging: HTML, HTML 5, IM, Email, Push Email, SMS (threaded view), MM
* Camera: 5 Megapixels,2560

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot