మెగా ఫ్యామిలీ షాకిచ్చిందా..?

Posted By:

టెక్నాలజీ ప్రపంచంలో మెగాఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న ‘సామ్ సంగ్' తన అభిమానులకు కంగుతినే షాకిచ్చినట్లు తెలుస్తోంది. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలతో వరస విజయాలు నమోదుచేస్తున్న సామ్‌సంగ్, ఫిబ్రవరి25 నుంచి నిర్వహించే గాడ్జెట్ ఎగ్జిబిషన్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2013కు దూరంగా ఉంటున్నట్లు పాకెట్-లింక్ వెల్లడించింది.

తమకు ఈ సమాచారం విశ్వసనీయంగా అందినట్లు సదరు పోర్టల్ చెప్పుకొచ్చింది. దింతో ఎండబ్ల్యూసీ 2013లో సామ్‌సంగ్ ఆవిష్కరణలు ఉంటాయా, లేదా అన్న అంశం పై వాడివేడి చర్చసాగుతోంది. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి నెలఖారులో నిర్వహించే గాలా (gala) ఈవెంట్‌లో సామ్‌సంగ్ కొత్త ఆవిష్కరణల ఉంటాయని మరో రూమర్ ద్వారా వెల్లడైంది.

మెగా ఫ్యామిలీ షాకిచ్చిందా..?

గెలాక్సీ ఎస్3 తరహాలో గెలాక్సీ ఎస్4ను మార్చి నెలలో ఆవిష్కరించి ఏప్రిల్ లేదా మేలో అందుబాటులోకి తేనున్నట్లు పలు విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికి ఈ సందేహాలకు సంబంధించి సమాధానాలను సామ్‌సంగ్ అధికారికంగా వెలువరించాల్సి ఉంది. మరోవైపు నోకియా ఎండబ్ల్యూసీ 2013లో తన సత్తాను చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot