ఆండ్రాయిడ్ వద్దు, బడా ముద్దు: శాంసంగ్

Posted By: Staff

ఆండ్రాయిడ్ వద్దు, బడా ముద్దు: శాంసంగ్

శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ రంగంలో రారాజు. మద్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకోని స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తూ ఉంటుంది. అలాంటి శాంసంగ్ మొబైల్ కంపెనీకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నమ్మకం పోయిందని అంటున్నారు నిపుణులు. అందుకే శాంసంగ్ తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ అయిన బడాకి కొనసాగింపుగా కొత్త వర్స న్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందని సమాచారం.

శాంసంగ్ ఇప్పటి వరకు విడుదల చేసిన బడా ఆపరేటింగ్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో మంచి సక్సెస్‌ని సాధించిన సంగతి తెలిసిందే. శాంసంగ్ మొబైల్ సోల్యూషన్స్ హెడ్ లీ హో సూ మాట్లాడుతూ కంపెనీ త్వరలో బడా ఆపరేటింగ్ సిస్టమ్ మీద మరిన్ని మొబైల్స్‌‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందని తెలిపారు. గతంలో మేము విడుదల చేసిన బడా ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్‌ని యూజర్స్‌ ప్రపంచం వ్యాప్తంగా ఆదరించడం జరిగింది. దీనికి ఉదాహారణ బడా ఆపరేటింగ్ సిస్టమ్‌తో శాంసంగ్ విడుదల చేసిన వేవ్ మొబైల్ ఇప్పటి కూడా శాంసంగ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌కి గట్టి పొటీనిస్తుంది.

ఐతే శాంసంగ్ బడా ఆపరేటింగ్ సిస్టమ్‌కి కొనసాగింపుగా కొత్త వర్సన్‌ని ఎప్పుడు విడుదల చేసేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. కానీ శాంసంగ్ బడా అపరేటింగ్ సిస్టమ్ మీద యూజర్స్ మాత్రం ఆశలు ఎక్కవగానే పెట్టుకొవడం జరిగింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్స్‌ని చూసి చూసి జనాభా విసిగిపోయారు. అందుకే కొత్తగా కొత్త ఫీచర్స్‌తోటి బడా ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తే సక్సెస్‌ని సాధిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇక బడా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే స్మార్ట్ ఫోన్స్‌కి ఖచ్చితంగా సెట్ అవుతుంది. బడా ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా మరిన్ని అప్లికేషన్స్‌ని డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం వల్లనే మార్కెట్లో బాగా సక్సెస్ సాధించిందని తెలిపారు. లీ హో సో మాత్రం బడా ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త వర్సన్ లో ఏయే అప్లికేషన్స్ ఉంటాయనేది మాత్రం స్పష్టం చేయలేదు. ప్రస్తుతానికి మొబైల్ పేమంట్, వాయిస్ రికగ్ననైజేషన్ ఫీచర్స్‌ని మాత్రమే అనుసంధానం చేయడం జరిగిందన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot