ఓవర్ ద ఎయిర్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ పై సామ్‌సంగ్ కసరత్తులు

Posted By: BOMMU SIVANJANEYULU

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో లీడింగ్ బ్రాండ్‌గా కొనసాగుతోన్న సామ్‌సంగ్ మరో విప్లవాత్మక ఆవిష్కరణ పై కన్నేసినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం సామ్‌సంగ్ తన అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్స్ అలానే టాబ్లెట్ పీసీల కోసం ఓవర్ ద ఎయిర్ (ఓటీఏ) వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ డాక్యుమెంటేషన్‌ను వరల్డ్ ఇంటలెక్ట్యుల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీఓ) రిలీజ్ చేసింది. సామ్‌సంగ్ నుంచి ఓ కొత్త టెక్నాలజీని భవిష్యత్‌లో చూడబోతున్నామని ఈ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో పోలిస్తే సామ్‌సంగ్ లాంచ్ చేయబోతోన్న టెక్నాలజీ అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉండబోతోందట. సామ్‌సంగ్ లాంచ్ చేయబోతోన్న కొత్త టెక్నాలజీతో డివైస్‌ను ఛార్జ్ చేసుకునేందుక ఎటువంటి డైరెక్ట్ కాంటాక్ట్ అవసరం ఉండదట.

జియో ప్రైమ్‌ ఉచిత రెన్యువల్ కనిపించడం లేదా, అయితే ఇలా చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొన్ని అడుగుల దూరంలో ఉన్నప్పటికి...

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైర్‌లెస్ ఛార్జింగ్ క్యూఐ ఎనేబుల్డ్ ఛార్జింగ్ ప్యాడ్ ఆధారంగా జరుగుతోంది. ఈ ప్యాడ్ పై డివైస్‌ను ప్లేస్ చేయటం ద్వారా ఛార్జింగ్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది. అయితే, సామ్‌సంగ్ తీసుకురాబోతోన్న ఓటీఏ వైర్‌లెస్ ఛార్జింగ్ క్యూఐ ఛార్జర్‌తో పోలిస్తే మరింత రేంజ్‌ను ఆఫర్ చేయగలుగుతుందట. అంటే ఛార్జర్ కు డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండానే ఛార్జింగ్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంటుంది. ఈ టెక్నాలజీతో ఛార్జర్‌కు కొన్ని అడుగుల దూరంలో ఉన్నప్పటికి డివైస్ ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది.

సామ్‌సంగ్ నుంచి విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే...

తాజాగా రివీల్ అయిన మరో రిపోర్ట్ ప్రకారం సామ్‌సంగ్ విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే తయారీ కోసం పేటెంట్‌ను ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్స్‌ప్యాండబుల్ స్వభావాన్ని కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే‌ను అవసరాన్ని బట్టి టాబ్లెట్ సైజు వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకుని అవసరం లేదనుకంటే స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌కు మడతపెట్టుకునే వీలుంటుందట. మూడు ఫ్లెక్సిబుల్ ప్యానళ్ల కలయకతో ఈ విప్లవాత్మక డిస్‌ప్లే రూపుదిద్దుకుంటున్నట్లు సామ్‌సంగ్ పేటెంట్ చెబుతోంది.

వైర్‌లెస్ చార్జింగ్ అంటే..?

స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో వైర్‌లెస్ చార్జింగ్ ఓ విప్లవాత్మక ఆవిష్కరణగా నిలిచింది. ఇండక్టివ్ పవర్ ట్రాన్స్‌ఫర్ సిద్ధాంతం ఆధారంగా స్పందించే వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్‌ల ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను వైర్లతో పనిలేకుండా చార్జ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఈ చార్జ్ ప్లేట్ లేదా ప్యాడ్ పై కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది.

యాపిల్ ఎయిర్ పవర్ ఛార్జర్

2017 ఆపిల్ బిగ్ ఈవెంట్‌లో భాగంగా యాపిల్ సంస్థ తన లేటెస్ట్ ఐఫోన్‌లతో పాటు విప్లవాత్మక ఎయిర్ పవర్ వైర్‌లెస్ చార్జర్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. తమ ఎయిర్‌పవర్ వైర్‌లెస్ ఛార్జింగ్ డివైస్ పై ఏకకాలంలో మూడూ యాపిల్ డివైస్‌లను ఛార్జ్ చేసుకోవచ్చని యాపిల్ వెల్లడించిన నేపథ్యంలో వీటి పై భారీ అంచనాలు నెలకున్నాయి.

 

 

యాపిల్‌కు పోటీగా సామ్‌సంగ్ డ్యుయల్ వైర్‌లెస్ ఛార్జర్‌..?

యాపిల్ ఎయిర్‌పవర్ ఛార్జర్ కోసం టెక్నాలజీ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ ప్రధాన రైవల్ కంపెనీ అయిన సామ్‌సంగ్ కూడా ఓ డ్యుయల్ వైర్‌లెస్ ఛార్జర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఛార్జర్‌కు సంబంధించిన పేటెంట్‌ను కూడా సామ్‌సంగ్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది.

Qi స్టాండర్డ్‌తో వచ్చే ప్రతి డివైస్‌ను సపోర్ట్ చేసే విధంగా...

ఈ పేటెంట్ ప్రకారం, సామ్‌సంగ్ వైర్‌లెస్ ఛార్జర్‌కు సంబంధించిన ఛార్జింగ్ బెడ్ పై ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లను చార్జ్ చేసుకునే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. Qi స్టాండర్డ్‌తో వచ్చే ప్రతి డివైస్‌ను సపోర్ట్ చేసే విధంగా సామ్‌సంగ్ ఈ చార్జర్‌ను బిల్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ప్రతిధ్వని (resonance), అయస్కాంత ప్రేరణ (magnetic induction) వంటి సిద్ధాంతాలను సామ్‌సంగ్ వినియోగించకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చార్జర్‌కు సంబంధించిన చార్జింగ్ బెడ్ పై ఏదైనా డివైస్‌ను ప్లేస్ చేసిన వెంటనే, ఆ డివైస్ ఏంటనేది గుర్తించటంతో పాటు, ఆ డివైస్ చార్జ్ అయ్యేందుకు అవసరమైన సూటబుల్ మాగ్నటిక్ చార్జింగ్ మోడ్‌ను కూడాా ఆటోమెటిక్‌గా ఈ చార్జర్ అడ్జస్ట్ చేసుకోగలుగుతుందట.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung is reportedly working on an over-the-air (OTA) wireless charging technology for its upcoming smartphones and tablets. If the patent documentation recently released by the World Intellectual Property Organization (WIPO) is to be believed, we might see the new tech in the future.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot