Home
Mobile

శాంసంగ్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ వివరాలు లీక్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, లాంచ్‌ వివరాలు..!

శాంసంగ్ నుంచి త్వరలో రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఫోల్డబుల్‌ మార్కెట్‌ రాణిస్తోన్న శాంసంగ్ మరో రెండు హ్యాండ్‌సెట్‌లను విడుదల చేయనుందని తెలుస్తోంది. కొన్ని లీక్‌ల ఆధారంగా ఈ జులైలో శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 మరియు గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 హ్యాండ్‌సెట్‌లు విడుదల కానున్నాయని తెలుస్తోంది.

అయితే శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 (Samsung Galaxy Z Fold 6 Smartphone) స్మా్ర్ట్‌ఫోన్‌ మే 17వ తేదీన గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌లో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ SM-F956U మోడల్‌ నంబర్‌తో కనిపించింది. దీంతోపాటు ఈ గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 హ్యాండ్‌సెట్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Samsung Z Fold 6 Smartphone expected to launch in july and spotted on geekbench

దీంతోపాటు మరిన్ని వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్‌ ఇప్పటికే విడుదలైన గెలాక్సీ S24 కంటే మెరుగైన కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ అమెరికా వేరియంట్‌ మల్టీ కోర్‌ టెస్టింగ్‌లో 6619 పాయింట్లు అదే సింగిల్‌ కోర్‌ టెస్టింగ్‌లో 1964 పాయింట్లు స్కోర్‌ చేసినట్లు తెలుస్తోంది.

గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 స్మార్ట్‌ఫోన్‌గా భావిస్తున్న 8 కోర్‌ CPU కలిగిన హ్యాండ్‌సెట్‌ కోడ్‌నేమ్‌ Pineapple గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 2.26 GHz బేస్‌ ఫ్రీక్వెన్సీ మరియు 3.40GHz గరిష్ఠ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.

దీంతోపాటు ప్రముఖ టిప్‌స్టర్‌ Kro తన X పోస్ట్ వివరాల ఆధారంగా శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 స్మార్ట్‌ఫోన్‌... శాంసంగ్‌ గెలాక్సీ S24 కంటే మెరుగైన కెమెరా స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లాంచ్‌ కానుందనే వివరాలను శాంసంగ్‌ అధికారికంగా వెల్లడించలేదు.

జులై 10 శాంసంగ్ తన రెండో గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ నిర్వహించనుందని అంచనా వేస్తున్నారు. ఈ ఈవెంట్‌లోనే శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌ టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. ఇవి డార్క్ బ్లూ, లైట్‌ పింక్‌ మరియు సిల్వర్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని సమాచారం. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 25W ఛార్జింగ్‌ సపోర్టుతో 4400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

** భారత్‌ మార్కెట్‌లోకి మే 27వ తేదీన శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా.. లాంచ్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. కారణాలను వెల్లడించలేదు. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.

వాటి ఆధారంగా.. శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ కానుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్‌ వేగాన్ లెదర్‌ ఫినిష్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఈ శాంసంగ్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OneUI పైన పనిచేస్తుందని తెలుస్తోంది. నాలుగు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చని తెలుస్తోంది. స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 1 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్‌ మరియు 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Z Fold 6 Smartphone spotted on geekbench here are the leaked specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X