'ఆపిల్‌'ని ఎటాక్ చేసేందుకు అస్త్రాలు సిద్దం: శాంసంగ్

Posted By: Super

'ఆపిల్‌'ని ఎటాక్ చేసేందుకు అస్త్రాలు సిద్దం: శాంసంగ్

 

స్మార్ట్ ఫోన్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న 'శాంసంగ్' ఉత్పత్తుల రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న ఆపిల్‌ని అణగదొక్కేందుకు పక్కా ప్రణాళికలను ముమ్మరం చేస్తుంది. ఈ రెండింటి ఉత్పత్తుల తయారీ విధంలో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆపిల్‌ని దెబ్బ తీసేందుకు గాను జర్మన్ కోర్టులో నాలుగు కొత్త కంప్లైట్స్‌ని ప్రవేశపెట్టనుంది. ఈ నాలుగు కంప్లైంట్స్‌లలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది 'డివైజ్ స్క్రీన్'.

గతంలో ఆపిల్ తన ఉత్పత్తులను శాంసంగ్  కాపీ కొడుతుందంటూ, శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్ విడుదలను నిలుపుదల చేయాలని కేసు

పెట్టిన విషయం విదితమే. త అక్టోబర్‌లో ఆపిల్ ఉత్పత్తులను శాంసంగ్ కాపీ కొట్టి ‘శాంసంగ్ గెలాక్సీ టాబ్’ని రూపొందించిందంటూ ఆపిల్ ఆస్ట్రేలియా కోర్డులో కేసు వేసి శాంసంగ్‌పై విజయం సాధించి ఆస్టేలియాలో ‘శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్’ లను అమ్మకూడదంటూ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై శాంసంగ్ ఆస్టేలియా హైకోర్టుని సంప్రదించగా జడ్జి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ వైపే మొగ్గు చూపడం జరిగింది.

ఈ విషయంపై ఆస్ట్లేలియా హైకోర్టు ప్రతినిధి మాట్లాడుతూ ఆపిల్ హైకోర్డుకి విన్నవించుకున్న అప్లికేషన్‌ని జడ్జి తోసిపుచ్చడం జరిగింది. ఇందుకు గల కారణం ఆపిల్ ఉత్పత్తుల ఖరీదుతో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఖరీదు సరిపోకపోవడమేనని అన్నారు. దీంతో శాంసంగ్ త్వరలో ఆస్టేలియాలో శాంసంగ్ గెలాక్యీ ట్యాబ్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

శాంసంగ్, ఆపిల్ మద్య యుద్దం కేవలం ఒక్క జర్మనీలోనే కాకుండా, అమెరికా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, యూరప్‌లలో కూడా జరుగుతుంది. స్మార్ట్ ఫోన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత శాంసంగ్ తనదైన శైలిలో దూసుకుపోతుంది. రాబోయే కాలంలో శాంసంగ్ ఆపిల్, బ్లాక్ బెర్రీ, నోకియా, మోటరోలా, హెచ్‌టిసి లాంటి కంపెనీలను ధీటుగా ఎదుర్కోని మొదటి స్దానాన్ని కైవసం చేసుకోవడం ఖచ్చితం అని అంటున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot