స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Sansui, రూ.3,999కే 4G VoLTE ఫోన్

జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ Sansui సరికొత్త సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Horizon 1 పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.3,999. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. 4G VoLTE సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ డీసెంట్ స్పెసిఫికేషన్‌లతో ఆకట్టుకుంటోంది.

తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కంప్యూటర్ తయారు చేసుకోండి (సింపుల్ ప్రొసీజర్)

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Sansui, రూ.3,999కే  4G VoLTE ఫోన్

Horizon 1 ప్రధాన స్పెసిఫికేషన్స్.. 4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 854x480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ Spreadtrum SC9832 చిప్‌సెట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE, 3జీ, 2జీ, 2000 mAh బ్యాటరీ.

ఇంటర్నెట్ దగ్గర నుంచి టెక్నాలజీ వరకు, మీకు తెలియని ఆసక్తికర నిజాలుEnglish summary
Sansui Horizon 1 4G smartphone launched at Rs.3,999. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting