వర్షంలో ఫోన్ తీసుకువెళుతున్నారా..?

వర్షంలో తడవటం మీకు ఇష్టం కావొచ్చు గాని, మీ స్మార్ట్‌ఫోన్‌కు ఏ మాత్రం ఇష్టంకాదు. ముఖ్యంగా వర్షాకాలంలో మీ స్మార్ట్‌ఫోన్‌లను వానల నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకోవల్సి ఉంటుంది. ఓ సర్వే ప్రకారం చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు వర్షా కాలంలోనే ఎక్కువుగా ప్రమాదాలకు గురువుతున్నాయట.

వర్షంలో ఫోన్ తీసుకువెళుతున్నారా..?

Read More : కనీవినీ ఎరగని డిస్కౌంట్‌లతో LeEco షాపింగ్ ఫెస్టివల్స్

వర్షపు నీరు ఫోన్ డిస్‌ప్లేతో పాటు యూఎస్బీ అలానే ఆడియో పోర్ట్‌లను నాశనం చేస్తుంది. పోర్టుల ద్వారా నీరు ఫోన్ లోపలి భాగాల్లోకి ప్రవహించి డివైస్ మొత్తాన్ని చిన్నాభిన్నం చేసే అవకాశం లేకపోలేదు. భారత్ వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో వాటర్ రెసిస్టెంట్ ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య చాలా తక్కువ. కాబట్టి వర్షా కాలంలో మీ స్మార్ట్‌ఫోన్‌లను కాపాడుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

మీ ఫోన్ వర్షంలో పాడవకుండా ఉండాలంటే వాటర్ ప్రూఫ్ కేస్‌ను ఫోన్‌కు రక్షణ కవచంలా ఉంచండి. ఈ వాటర్ ప్రూఫ్ కేస్‌లు పోన్‌లోకి నీరు చొరబడకుండా చూస్తాయి.

టిప్ 2

ఒకవేళ మీవద్ద వాటర్ ప్రూఫ్ కేస్‌ అందుబాటులో లేకపోయినట్లయితే జిప్‌లాక్ పౌచ్ లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో ఫోన్‌ను ఉంచండి. ఈ జిప్‌లాక్ పౌచ్ పోన్‌లోకి నీరు చొరబడకుండా చూస్తుంది.

టిప్ 3

ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ కూడా మీ ఫోన్‌ను వర్షపు చినుకుల నుంచి కాపాడగలదు. వర్షంలో వెళ్లవల్సి వచ్చిన సమయంలో మీ వద్ద పైన సూచించిన వస్తువులు అందుబాటులో లేకపోయినట్లయితే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లో ఫోన్‌ను గట్టిగా చుట్టి తీసుకువెళ్లిండి.

టిప్ 4

వర్షపు చినుకుల ప్రమాదం నుంచి అప్పటికప్పుడు మీ ఫోన్‌ను కాపాడుకోవాలంటే బెలూన్ ట్రిక్‌ను అప్లై చేయండి. మీ సమీపంలోని దుకాణంలో ఓ వెడల్పు బెలూన్‌ను కొనుగోలు చేసి అందులో మీ ఫోన్‌ను భద్రపరచండి.

టిప్ 5

వాటర్ ప్రూఫ్ సపోర్ట్ లేని ఫోన్‌లను తడిచేతులతో ముట్టుకోకూడదు కాబట్టి వర్షంలో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్‌ను బ్యాగ్‌లో ఉంచి బ్లూటత్ హెడ్‌సెట్ ద్వారా కాల్స్‌ను అటెండ్ చేయండి.

టిప్ 6

వాటర్ ప్రూఫ్ సెక్యూరిటీ లేని ఫోన్‌లను తడిచేతులతో ముట్టుకోకూడదు కాబట్టి వర్షంలో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్‌ను బ్యాగ్‌లో ఉంచి బ్లూటత్ హెడ్‌సెట్ ద్వారా కాల్స్‌ను అటెండ్ చేయండి.

టిప్ 7

తడిచేతులతో మీ ఫోన్‌ను ఆపరేట్ చేయవల్సి వస్తే ముందుగా మీ చేతులను టవల్‌తో తుడుచుకోండి. హ్యాండ్ టవల్‌ను మీ వెంట క్యారీ చేయటం వల్ల ఫోన్ డ్యామేజ్ నుంచి తప్పించుకోవచ్చు. ‌

టిప్ 8

సాధ్యమైనంత వరకు వర్షాకాలంలో మీ ఫోన్‌లను బయటకు తీసుకువెళ్లకండి. ఒకవేళ తీసుకురావల్సి వస్తే పైన సూచించిన జాగ్రత్తలను పాటించండి.

టిప్ 9


నీటిలో తడిచిన ఫోన్‌ను వెంటనే ఛార్జ్ చేయకండి. ఒకవేళ చార్జ్ చేస్తే మీ ఫోన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే ప్రమాదముంది.

టిప్ 10

వర్షాకాలంలో బయటకు వెళుతున్పప్పడు స్మార్ట్‌ఫోన్‌లకు బదులు బేసిక్ హ్యాండ్‌సెట్‌లను క్యారీ చేయటం ఉత్తమం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Do These 10 Things to Save Your Smartphone During Rainy Season. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot