రూ.499కే మోటో ఇ3 పవర్..?

దీపావళి పండుగ సమీపిస్తోన్న నేపథ్యంలో ఆన్‌లైన్ షాపర్‌లను ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ దిగ్గజాలు స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లకు తెరలేపిన విషయం తెలిసిందే.

రూ.499కే మోటో ఇ3 పవర్..?

ఈ నేఫథ్యంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌ను పురస్కరించుకుని మోటరోలా Moto E3 Power ఫోన్‌ను కేవలం రూ.499కే విక్రయిస్తున్నారంటూ ఓ టెంప్టింగ్ ఆఫర్ వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. వాస్తవానాకి మోటా ఇ3 పవర్ రూ.7,999 ధర ట్యాగ్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో ట్రేడ్ అవుతోంది. మరి ఈ వాట్సాప్ మెసెజ్‌లో నిజమెంత..?

Read More : డబ్బులు సంపాదించిపెట్టే ఆండ్రాయిడ్ యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ టెంప్టింగ్ మెసేజ్ పై క్లిక్ చేసిన వెంటనే..

మోటో ఇ3 పవర్ డీల్‌కు సంబంధించి వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ టెంప్టింగ్ మెసేజ్ పై క్లిక్ చేసిన వెంటనే మీరో Flipkart webpageలోకి వెళతారు. వాస్తవానికి ఇది ఇది ఒరిజినల్ ఫ్లిప్‌కార్ట్ పేజీ కాదు.

మిమ్మల్ని బురిడి కట్టించటానికే

ఈ వెబ్ పేజీలో మోటో ఇ3 పవర్ ధర రూ.499గా ఉంటుంది. అంతేకాకుండా ఆర్డర్ చేసిన యూజర్లకు సంబంధించి రివ్యూ మెసేజెస్ కూడా మీకు కనిపిస్తాయి. ఇవన్ని మిమ్మల్ని బురిడి కట్టించటానికే.

‘Buy Now' ఆప్షన్ కనిపిస్తుంది

ఈ పేజీలో మీకు ‘Buy Now' ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే వేరొక విండోలోకి రీడైరెక్ట్ కాబడతారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

unknown web addressలోకి

ఇక్కడ మీ అడ్రస్ వివరాలతో పాటు ఈ మెసెజ్ ను 8 మంది వాట్సాప్ మిత్రులకు షేర్ చేయాలని అడుగుతుంది. అలా చేసిన వెంటనే మీరు unknown web addressలో రీడైరెక్ట్ కాబడతారు.

క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు

అక్కడ మీ ఆర్డర్‌ను కన్ఫర్మ్ చేసిన తరువాత ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్‌లోకి వెళతారు. ఇక్కడ కేవలం debit/credit card ఆప్షన్ మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అందుబాటులో ఉండదు.

పొరపాటున మీరు డబ్బులు చెల్లించినట్లయితే..?

పొరపాటున మీరు డబ్బులు చెల్లించినట్లయితే మీరు చాలా సులువుగా వాళ్ల మోసగాళ్ల బట్టులో పడిపోయినట్లే. కాబట్టి ఇలాంటి మోసూపూర్తి ఆఫర్లను ఏమాత్రం విశ్వసించకండి.

తొలి రోజే లక్ష మంది కొనుగోలు చేసారు..

సెప్టంబర్ 19న ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అయిన మోటో ఇ3 పవర్ స్మార్ట్‌ఫోన్ తీవ్రమైన పోటీ వాతావరణంలోనూ అమ్మకాలు దుమ్ము రేపింది. అమ్మకాలు ప్రారంభమైన తొలి రోజునే ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా లక్ష మంది కొనుగోలు చేసినట్లు మోటరోలా మొబిలిటీ ఇండియా జనరల్ మేనేజర్ అమిత్ బోని తెలిపారు.

మోటో ఇ3 పవర్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 294 పీపీఐ, ఫోన్ నీటిలో తడవకుండా వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్ , క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, బరస్ట్ మోడ్, హెచ్‌డిఆర్, పానోరమా, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, టాప్ టు ఫోకస్, టాప్ టు క్యాప్చుర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : బ్యూటిఫికేషన్ మోడ్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 4G + VoLTEసపోర్ట్, 3జీ, వైఫై, బ్లుటూత్, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ lOW రాపిడ్ చార్జ్.

రూ.7000 వరకు స్పెషల్ ఎక్స్‌ఛేంజ్

Moto e3 Power ఫోన్ కొనుగోలు పై రూ.7000 వరకు స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను మోటరోలా, ఫ్లిప్‌కార్ట్‌లు అందిస్తున్నాయి. అంటే కండీషన్‌లో ఉన్న మీ ఫోన్ పై రూ.7000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యు లభించే అవకాశం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Scam Alert: Moto E3 Power Is Available for Rs. 499 on Flipkart Big Diwali Sale?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot