సముద్రంలో పడిపోయిన ఐఫోన్ 7, ఒక్క మెసేజ్‌తో ప్రపంచాన్ని మాయ చేసింది

|

మనం ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ను ఎంతో ఖర్చుపెట్టి కొనుగోలు చేస్తుంటాం. అయితే ఆఫోన్ పొరపాటున నీళ్లలో పడితేనే దాన్ని వదిలేసి కొత్త ఫోన్ కొనుక్కోవాలి. కొంచెం ఖరీదైన ఫోన్ అయితే, సర్వీస్ ఇంజనీర్ వద్దకు తీసుకెళ్లితే పనిచేస్తుందేమో. ఇక చాలాసేపు నీళ్లల్లో ఫోన్ పడిపోతే దానిపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే, నాణ్యతకు మారుపేరైన ఆపిల్ ఫోన్లకు మాత్రం ఇది వర్తించదు. ఆపిల్‌ ఐఫోన్లు ఫర్‌ఫార్మెన్స్‌కు మారు పేరుగా నిలుస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణే ఐఫోన్‌ 7. సముద్రంలో దానిపని తీరు అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది. వివరాల్లోకి వెళితే..'

 

జియోకి బిఎస్ఎన్ఎల్ సవాల్, నెలకి 1500 జిబి డేటాజియోకి బిఎస్ఎన్ఎల్ సవాల్, నెలకి 1500 జిబి డేటా

ఆపిల్‌ ఐఫోన్‌ 7

ఆపిల్‌ ఐఫోన్‌ 7

కెనడా సందర్శకుడికి చెందిన ఆపిల్‌ ఐఫోన్‌ 7 పొరపాటున సముద్రంలోకి పడిపోయింది. ఎంత వెతికినా అతనికి దొరకకపోయే సరికి దానిపై ఆశలు వదిలేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

స్కూబా డైవర్ సిరీస్ హార్సీ ..

స్కూబా డైవర్ సిరీస్ హార్సీ ..

అదే సమయంలో యూకేకు చెందిన స్కూబా డైవర్ సిరీస్ హార్సీ అదే ప్రాంతంలో డైవింగ్ చేస్తూ వెళ్లింది. ఎక్కడో లోపలి నుంచి సన్నగా మెరుపు కనిపించడంతో అదేంటో చూద్దామని వెళ్లింది.

సముద్రంలో ఉన్నప్పుడు కూడా..

సముద్రంలో ఉన్నప్పుడు కూడా..

సముద్రంలో పడిపోయిన ఆపిల్ ఐఫోన్ 7, నానిపోయినా కూడా ఇంకా పనిచేస్తూనే ఉంది.ఇది సముద్రంలో ఉన్నప్పుడు కూడా సిగ్నల్స్ ను సరిగ్గా అందుకుంది.

టెక్ట్స్‌ మెసేజ్‌ రావడంతో..
 

టెక్ట్స్‌ మెసేజ్‌ రావడంతో..

సముద్ర గర్బంలో వెలుగులు చిందిస్తున్న ఆ వస్తువును చూసి ఆమె షాకైంది. ఆ వస్తువే ఐఫోన్‌ 7. టెక్ట్స్‌ మెసేజ్‌ రావడంతో, ఆ ఐఫోన్‌ 7ను వెలుతురుతో మెరవడంతో ఆమె ఆ డివైజ్‌ను బయటకు తీసుకువచ్చింది.

 48 గంటల పాటు నీటిలోనే

48 గంటల పాటు నీటిలోనే

దాదాపు 48 గంటల పాటు నీటిలోనే ఉన్న ఫోన్ పని తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతసేపు పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న 84 శాతం బ్యాటరీ సామర్థ్యంతో ఆ ఫోన్‌ మంచిగా పనిచేస్తుందని తెలిసింది.

తన వద్దనే ఉంచుకోకుండా..

తన వద్దనే ఉంచుకోకుండా..

హార్సీ తనకు దొరికిన ఐఫోన్‌ 7 ను తన వద్దనే ఉంచుకోకుండా.. ఆ ఫోన్‌ పోగొట్టుకున్న కెనడియన్‌కు అందచేసింది.

వాటర్‌ రెసిస్టెన్స్‌తో ఐపీ67 రేటింగ్‌

వాటర్‌ రెసిస్టెన్స్‌తో ఐపీ67 రేటింగ్‌

ఈ డివైజ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌తో ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ కేసుతో ఐఫోన్‌ 7 ఎంత స్ట్రాంట్‌గా పనిచేస్తుందో మరోసారి వెల్లడైంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దీని పనితీరు అద్భుతమని టెక్‌ విశ్లేషకులు సైతం అంటున్నారు.

ఆపిల్ ఫోన్ కి అంత మహత్యం ఉందా..

ఆపిల్ ఫోన్ కి అంత మహత్యం ఉందా..

ఈ విషయాన్ని డిజిటైమ్స్‌ వెల్లడించింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజంగా ఆపిల్ ఫోన్ కి అంత మహత్యం ఉందా అని అందరూ నోరెళ్లబెడుతున్నారు.

Best Mobiles in India

English summary
Scuba diver finds iPhone lost at sea for two days - after TEXT lights it up more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X