Home
Mobile

రెప్ప పాటులో అమ్ముడుపోయిన నోకియా ఫోన్‌లు

నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి గురువారం చైనాలో జరిగిన రెండవ ఫ్లాష్‌సేల్ రెప్పపాటులో ముగిసినట్లు సమాచారం. ఈ సేల్ నిమిత్తం 14 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు రిజిస్టర్ అయ్యారు.

By Sivanjaneyulu Bommu

నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి గురువారం చైనాలో జరిగిన రెండవ ఫ్లాష్‌సేల్ రెప్పపాటులో ముగిసినట్లు సమాచారం. ఈ సేల్ నిమిత్తం 14 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు రిజిస్టర్ అయ్యారు. జనవరి 19న జరిగిన మొదటి ఫ్లాష్ సేల్‌లో భాగంగా కేవలం 60 సెకన్ల వ్యవధిలో 100,000 ఫోన్‌లు అమ్ముదైన విషయం తెలిసిందే. JD.com ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబడుతోన్న నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఆరంభం నుంచి భారీ హైప్ క్రియేట్ చేస్తూ వస్తోంది.

ఇవి పాటిస్తే.. మీ మొబైల్ ఛార్జింగ్ నిమిషాల్లో ఫుల్!

Source: nokiapoweruser

చైనా మార్కెట్లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా

చైనా మార్కెట్లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా

నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లను ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నారు. ఇండియన్ మార్కెట్లో నోకియా 6 అందుబాటుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమచారం లేదు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో ఓ స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

నోకియా 6 స్పెసిఫికేషన్స్

నోకియా 6 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.

బెంచ్ మార్క్ స్కోర్‌

బెంచ్ మార్క్ స్కోర్‌

భారీ అంచనాల మధ్య మార్కెట్లో అయిన నోకియా 6 బెంచ్ మార్క్ స్కోర్‌ను Geekbench విడుదల చేసింది. ఈ ఫలితాల ప్రకారం నోకియా 6, 44,517 పాయింట్లను స్కోర్ చేయగలిగింది.

హై-ఎండ్ ఫోన్ ఏమి కాదు

హై-ఎండ్ ఫోన్ ఏమి కాదు

Geekbench వెల్లడించిన స్కోర్ ప్రకారం చూస్తే, నోకియా 6 ఫోన్‌లో హై-ఎండ్ గేమ్స్ అలానే యాప్స్‌ను రన్ చేయటం కొద్దిగా కష్టమే. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే..? నోకియా 6 ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తోంది.

Best Mobiles in India

English summary
Second Flash Sale: Nokia 6 sells out yet again in no time. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X