మోటో ఇ (సెకండ్ జనరేషన్) స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఇవే..?

Posted By:

మార్కెట్ రీఎంట్రీతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త సంచలనాలను నమోదు చేస్తున్న మోటరోలా ఇటీవల తన మోటో జీ, మోటో ఎక్స్ సెకండ్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలింసిందే. తాజా మార్కెటింగ్ వ్యూహరచనలో భాగంగా ‘మోటో ఇ' సెకండ్ జనరేషన్‌ను ఫో‌న్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు మోటరోలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మోటో ఇ2 స్పెసిఫికేషన్‌ల పై మార్కెట్లో ఇప్పటికే అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విడుదలైన మరో రిపోర్ట్ మోటో ఇ2కు స్పెసిఫికేషన్‌లను మరోసారి తేటతెల్లం చేసింది. ఈ ఫీచర్లలో నిజానిజాలు ఎంతా అనేది మోటో ఇ2 అధికారికంగా విడుదలైనపుడు మాత్రమే తెలుస్తుంది.

మోటో ఇ2  స్పెసిఫికేషన్‌లు ఇవే..?

మోటో ఇ2 స్పెసిఫికేషన్‌లు (అనధికారికంగా)...

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960×540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి వివరాలు తెలియరాలేదు, ఈ ఫోన్ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే అవకాశముంది.

ఇదే సమయంలో మోటరోలా మొదటి వర్షన్ మోటో ఇ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను పరిశీలించినట్లయితే... 4.3 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960x540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (హెచ్ ఎస్ఏ+, బ్లూటూత్ 4.0, జీపీఎస్, వై-ఫై కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్), 1989 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం
క్లిక్ చేయండి.

English summary
Second Generation Moto E Specs Potentially Leaked Ahead of Launch. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot