‘జూలై’లో వాటిని తాకుతా!

Posted By: Prashanth

‘జూలై’లో వాటిని తాకుతా!

 

శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా ప్రారంభమైన గుగూల్ ఐ/వో 2012 సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తొలి రోజైన బుధవారం దిగ్గజ సెర్చ్‌ఇంజన్ గుగూల్ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను ప్రకటించింది. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు సక్సెసర్‌గా రూపుదిద్దుకున్న జెల్లీబీన్ వోఎస్ వాయిస్ టైపింగ్, నోటిఫికేషన్స్, ఆండ్రాయిడ్ ఐసీఎస్ సెర్చ్ వంటి ఆధునిక అంశాలను విస్తరించుకుని ఉంది.

గుగూల్ ఎంపిక చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ నెక్సస్ ఎస్, మోటరోలా జూమ్ తదితర గెలాక్సీ నెక్సస్ హ్యాండ్‌సెట్‌లకు జూలై 15నాటికి జెల్లీబీన్ అప్‌డేట్ వర్తించనుంది. జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్‌లో నిక్షిప్తం చేసిన కొత్త ఫీచర్ ‘గుగూల్ నౌ’వాతావారణం, ట్రాఫిక్, స్కోర్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచుతుంది. వోఎస్‌లో నిక్షిప్తం చేసిన ఎన్ఎఫ్‌సి సపోర్ట్ ఫీచర్ సౌలభ్యతతో ఫోటో కంటెంట్‌తో పాటు డేటా కంటెంట్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

ఇదే వేదిక పై గుగూల్, నెక్సస్ 7 టాబ్లెట్‌ను ఆవిష్కరించింది.అసస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ ఆపిల్ కొత్త ఐప్యాడ్ అదేవిధంగా ఆమోజన్ కిండిల్ ఫైర్ టాబ్లెట్ పీసీలతో పోటీ పడనుంది. రెండు మెమరీ వర్షన్‌లలో గుగూల్ నెక్సస్ 7 లభ్యం కానుంది. 8జీబి వర్షన్ ధర $199.16జీబి వర్షన్ ధర $249.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot