పోర్న్ సైట్‌ల ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వ్యాపిస్తోన్న భయంకరమైన వైరస్
ఈ మాల్వేర్ సోకిన ఫోన్‌లో Ks Clean అనే యాప్ ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరో భయంకరమైన ముప్పు పొంచి ఉంది. kskas.apk పేరుతో ప్రమాదకరమైన యాప్ ఒకటి దానంతటికదే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ అయిపోతోంది. Ks Clean పేరుతో ఈ యాప్ పైకి కనిపిస్తోంది. పోర్న్ అలానే పైరేటెడ్ కంటెంట్ వెబ్‌సైట్స్ ద్వారా ఈ మాల్వేర్ స్మార్ట్‌ఫోన్‌లలోకి ఇన్‌ఫెక్ట్ అవుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

ఈ మాల్వేర్ సోకిన ఫోన్‌లో Ks Clean అనే యాప్ ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయించే క్రమంలో యూజర్‌ను ఊరించే విధంగా ఒక పాపప్ మెసేజ్‌ను డిస్‌ప్లే చేస్తుంది. ఈ పాపప్ మెసేజ్‌కు "Ok" బటన్ తప్ప "cancel" or "close" వంటి బటన్స్ ఉండవు. "Ok" బటన్ పై క్లిక్ చేసినట్లయితే "update" పేరుతో మరొక యాప్ దానంతటకదే మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ కాబడి ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఈ యాప్‌ను మీరు అన్‌ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ యాప్ మీకు తెలియకుండానే మన ఫోన్‌లోని సమాచారాన్ని హ్యాకర్లు చేరవేసేస్తుంటుంది. Ks Clean మాల్వేర్‌కు దూరంగా ఉండాలంటే, పోర్న్ వెబ్‌సైట్‌లతో పాటు పైరేటెడ్ సైట్‌ల జోలికి వెళ్లకండి.


Click it and Unblock the Notifications