రెటీనా అన్‌లాక్ ఫీచర్‌తో it1520, ధర రూ.8,490

ఐటెల్ (itel) కంపెనీ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. సెల్పీ ప్రో it1520 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఖరీదు రూ.8,490.

రెటీనా అన్‌లాక్ ఫీచర్‌తో it1520, ధర రూ.8,490

ఫ్రంట్ ఐరిస్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో రెటీనా అన్‌లాక్ ఫీచర్‌ను పొందుపరిచారు. అంటే మీ కంటిచూపుతో ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చన్నమాట. ఫోన్ ముందు, వెనుక భాగాల్లో 13 మెగా పిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్స్పె మిగితా సిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ డిస్‌ప్లే వచ్చేసరికి...

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఆన్-సెల్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్1280x 720పిక్సల్స్),

ప్రాసెసర్, ర్యామ్

1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్,

స్టోరేజ్

16జీబి ఇంటర్సల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

శక్తివంతమైన కెమెరా వ్యవస్థ..

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, తక్కువ వెళుతురు కండీషన్ లలోనూ హైక్వాలిటీ సెల్పీలను చిత్రీకరించుకునేందుకు ఫ్రంట్ ఎల్ఈడి ఫ్లాష్,

బ్యాటరీ..

2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 6.0 Marshmallow అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆపరేటింగ్ సిస్టం.

4G LTE అలానే VoLTE సపోర్ట్‌

it1520 ఫోన్ 4G LTE అలానే VoLTE సపోర్ట్‌తో వస్తోంది. రిలయన్స్ జియో నెట్‌వర్క్‌తో పాటు వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ రెడ్మీ నోట్ 3, మోటో ఇ3 పవర్, కూల్‌ప్యాడ్ నోట్ 5 వంటి ఫోన్‌ల నుంచి పోటీని ఎదుర్కోవల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Selfie pro itel it1520: Cheapest smartphone to feature an Iris Scanner. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot