మొట్టమొదటి 3డీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్..

Posted By: Staff

మొట్టమొదటి 3డీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్..

ఇప్పటి వరకు మనం మార్కెట్లో స్మార్ట్ ఫోన్లు గురించి విన్నాం. కానీ ఇప్పడు అదే స్మార్ట్ ఫోన్‌లో త్వరలో 3డి ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా.. కేవలం 3డి సినిమాలను చూడడమే కాదండి..త్వరలో స్మార్ట్ ఫోన్‌లో 3డి ఫీచర్స్‌ని ప్రవేశపెట్టనున్నారు. ఈ మొబైల్ ఫోన్‌ని జపనీస్‌కి చెందిన మొబైల్ తయారీదారు ఎన్‌టిటి డొకామో, ప్రెంచ్ ఆరంజ్ ఇద్దరూ భాగస్వామ్యంతో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వీరిద్దరి భాగస్మామ్యంలో విడుదలకు సిద్దమైన ఈ 3డి స్మార్ట్ ఫోన్‌కి 'అక్వోస్ ఫోన్ ఎస్‌హెచ్ 80ఎఫ్'గా నామకరణం చేయడం జరిగింది. అక్వోస్ ఫోన్ ఎస్‌హెచ్ 80ఎఫ్ మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇందులో ఉన్న ముఖ్యమై ఫీచర్స్‌లలో ఒకటి డిజిటల్ టివి ట్యూనర్ కార్డ్. దీని సహాయంతో మొబైల్‌ని టివికి కనెక్ట్ చేసుకొని అప్ డేట్స్‌ని చెక్ చేసుకొవచ్చు. 3డీ ఫీచర్‌ని ఇందులో ఇమిడికృతం చేయడం వల్ల 3డి సినిమాలను ఎంజాయ్ చేయవచ్చు.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరయన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 3డి డిస్ ప్లేని కలిగి ఉంది. ఇక మొబైల్ ముందు భాగంలో ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో యూజర్స్ వీడియో ఛాటింగ్ ఎక్స్ పీరియన్స్‌ని కూడా పొందవచ్చు. అక్వోస్ ఫోన్ ఎస్‌హెచ్ 80ఎఫ్ మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌‌తో రన్ అవడంతో గూగుల్‌కి సంబంధించిన అన్ని రకాల అప్లికేషన్స్‌ని ఈజీగా డౌన్ లోడ్ చేసుకొవచ్చు. ఇక మొబైల్ ముందు భాగంలో ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరాతో యూజర్స్ అద్బుతమైన ఫోటోలను తీసుకొవచ్చు.

వీటితో పాటు ఎల్‌ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్ మొబైల్ ప్రత్యేకతలు. ఇక కనెక్టివటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే బ్లూటూత్, వై-పైలను సపోర్ట్ చేస్తుంది. జిపిఎస్ ఫెసిలిటీ ఉండడం వల్ల వావిగేషన్‌కి కూడా మొబైల్‌ని ఉపయోగించవచ్చు. అక్వోస్ ఫోన్ ఎస్‌హెచ్ 80ఎఫ్ మొబైల్ మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మొబైల్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అందుకు గల కారణం తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్స్ ఉన్న మొబైల్‌గా 'అక్వోస్ ఫోన్ ఎస్‌హెచ్ 80ఎఫ్' ని పరిగణిస్తున్నారు.

అక్వోస్ ఫోన్ ఎస్‌హెచ్ 80ఎఫ్ మొబైల్ ధర ఇండియన్ మొబైల్ మార్కెట్లో సుమారుగా రూ 13,500గా ఉండవచ్చునని అంచనా..ఇక మొమొరీ విషయానికి వస్తే ఇంటర్నల్‌గా 2 GB storage, 512 MB RAMమొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రోఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు కల్పించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot