‘షార్ప్’గా మీడియాను బుట్టులో పడేసింది..?

Posted By: Prashanth

‘షార్ప్’గా మీడియాను బుట్టులో పడేసింది..?

 

ఫీచర్ రిచ్ ఆండ్రాయిడ్ ఫోన్ ‘షార్ప్ ఆక్వోస్ 104SH’ మీడియా దృష్టిని ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పని చేసే ఈ డివైజ్ ఇతర ఫోన్‌లకు చుక్కులు చూపిస్తుందని విశ్లేషకులు వాపోతున్నారు. ఈ ఏడాది ప్రధమాంకంలో విడుదల కాబోతున్న ఈ స్టన్నింగ్ కమ్యూనికేషన్ డివైజ్ పై స్పెషల్ ఫోకస్....

ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వోఎస్‌తో సమర్ధవంతంగా పనిచేసే ఈ మొబైల్‌లో శక్తివంతమైన OMAP 4460 ప్రాసెసింగ్ వ్యవస్థను నిక్షిప్తం చేశారు. ప్రాసెసర్ వేగం 1.5 GHz కావటంతో సెకన్ల వ్యవధిలో మొబైల్ సంబంధిత లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు. ర్యామ్ సామర్ధ్యం 1జీబి, మల్టీ టచ్ ఫీచర్‌ను కలిగిన ఫోన్ డిస్‌ప్లే పరిమాణం 4.5 అంగుళాలు, 12.8 మెగా పిక్సల్ సామర్ధ్యం గల ఫోన్ ప్రైమరీ కెమెరా నాణ్యమైన హై రిసల్యూషన్‌తో వీడియోలను చిత్రీకరిస్తుంది, సెకండరీ కెమెరా సామర్ధ్యం 0.3 మెగా పిక్సల్ ద్వారా లైవ్ వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు.

పొందుపరిచిన ‘వై-ఫై’ 802.11 b/g/n, జీపీఎస్ (GPS)వ్యవస్థలు ఫోన్ ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతాయి. ఏర్పాటు చేసిన బ్లూటూత్, యూఎస్బీ పోర్ట్ వ్యవస్థలు డేటాను ఖచ్చితమైన వేగంతో షేర్ చేస్తాయి. మన్నికైన ఫోన్ డిస్‌ప్లే, పెద్ద తెర పై చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఫోన్ ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot