షార్ప్ సంస్ద వినూత్న ప్రయోగం చాక్‌లెట్ స్మార్ట్‌ఫోన్

Posted By: Super

షార్ప్ సంస్ద వినూత్న ప్రయోగం చాక్‌లెట్ స్మార్ట్‌ఫోన్

టెక్నాలజీ గురించి మాట్లాడుకొవాల్సిన తరుణం వచ్చింది. సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రోయో, హానీ కొంబ్, ఐస్ క్రీమ్ సాండ్ విచ్ లాంటి వినూత్నమైన పేర్లను పెడితే, దీనిని ఆదర్శంగా తీసుకొని షార్ప్ అనే సంస్ద స్మార్ట్ ఫోన్‌ని చాక్ లెట్ రూపంలో తయారు చేసింది. చాక్ లెట్ రూపంలో ఫోన్ ఏంటీ అని అనుకుంటున్నారా.. ఇది నిజంగా నిజం. ఈ ప్రక్క చిత్రంలో ఉన్న ఫోటోని చూస్తే మీకు అర్దం అవుతుంది. షార్ప్ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ మొబైల్ పేరు 'షార్ప్ క్యూ పాడ్'.

ఈ ఫోన్‌ని షార్ప్ సంస్ద అచ్చం చాక్ లెట్ మాదరే తయారు చేయడం ఇక్కడ విశేషం. ఇలా తయారు చేయడం వల్ల ఈ ఫోన్‌పై యూత్, మాస్ అన్ని రకాల కస్టమర్స్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నారు. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ కూడా ఆద్యంతం యూజర్స్‌ని ఊరిస్తున్నాయి. దీని ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను MSM 8255 Snapdragon 1GHz CPU, 512MB RAM ప్రాససెర్స్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

ఇక యూజర్స్‌కి చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీనియొక్క స్క్రీన్ సైజు 3.7 ఇంచ్‌గా రూపొందించడమే కాకుండా, రిజల్యూషన్ 540 x 960 ఫిక్సల్‌గా తయారు చేయడం జరిగింది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీసుకొవచ్చు. ఇక కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే ఎల్‌ఈడి ఫ్లాష్ ప్రత్యేకం.

ఇక మార్కెట్లో ప్రస్తుతం లభ్యమవుతున్న అన్ని రకాల ఆడియో,వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్, వై-పైలను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌ని అక్టోబర్ 18న ఎన్‌టిటి డొకొమో ద్వారా జపాన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ స్మార్ట్ ఫోన్‌ని అతి కొద్ది మందికే అందుబాటులోకి రానుంది. దీనికి కారణం ప్రస్తుతానికి ఈ మొబైల్ ఫోన్‌‌ని తయారు చేసిన సంస్ద షార్ప్ కేవలం 3000 యూనిట్లను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దీని ఖరీదుని మాత్రం మార్కెట్లో ఇంకా వెల్లిడంచలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వన్ ఇండియా మొబైల్‌లో పాఠకులకు అందివ్వడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot