షార్ప్ సెగ జపాన్ వరకేనా..?

Posted By: Super

షార్ప్ సెగ జపాన్ వరకేనా..?

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ తన సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను ఇటీవల లాంఛ్ చేసింది. మోడల్ నెంబర్ SH-06D NERV. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేస్తుంది. ఇతర ఫీచర్లను పరిశీలిద్దాం.


ఈ క్లాసికల్ స్టైల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌సైజ్ 4.5 అంగుళాలు. మల్టీ టచ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుంది. ఈ 3డి MAGI డిస్‌ప్లే రిసల్యూషన్ స్థాయి 720 × 1280 మెగా పిక్సల్స్.

గుగూల్ ఆండ్రాయిడ్ వీ2.3 యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టంను లోడ్ చేశారు. ప్రాసెసర్ సామర్ధ్యం 1.2జిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ9 డ్యూయల్ కోర్, నిక్షిప్తం చేసిన ‘పవర్ వీఆర్ ఎస్ జీఎక్స్ 540 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్’ మన్నికైన మల్టీమీడియా అనుభూతులను మీకు కలిగిస్తుంది.

ఫోన్ వెనుక భాగంలో అమర్చిన కెమెరా 8 మెగా పిక్సల్ సామర్ధ్యాన్ని కలిగి ఉత్తమ క్వాలటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తుంది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన 0.3 మెగా పిక్సల్ కెమెరా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు సహకరిస్తుంది. ర్యామ్ సామర్ధ్యం 1జీబి, ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి, మైక్రోఎస్డీ , మైక్రో ఎస్డిహెచ్‌సీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకోవచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లు:

జీపీఆర్ఎస్,


ఎడ్జ్,


3జీ,


వై-ఫై ఎన్


బ్లూటూత్ సపోర్ట్ (A2DP, AVRCP, HFP, HID, HSP,OPP, PBAP, SPP),


మైక్రో యూఎస్బీ 2,


జీపీఎస్ ఫెసిలిటీ,


ఆండ్రాయిడ్ బ్రౌజర్.

2జీ (జీఎస్ఎమ్ 1800, 1900, 850, 900), 3జీ (UMTS 1700, UMTS 2100, UMTS 850, HSDPA, HSUPA ) నెట్‌వర్క్‌లను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. నిక్షిప్తం చేసిన ఆడియో, వీడియో ప్లేయర్ అప్లికేషన్‌లు ఉత్తమ క్వాలటీ వినోదాన్ని చేరువచేస్తాయి. వివిధ వర్షన్‌లలో గేమ్‌లను ప్లే చేసుకోవచ్చు. ఎఫ్ఎమ్ రేడియోను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. ఏర్పాటు చేసిన స్పీకర్ వ్యవస్థ ఉత్తమ శ్రేణి ఆడియోను విడుదల చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్‌ను పరిశీలిస్తే స్టాండ్ బై సమయం 420 గంటలు, టాక్ టైమ్ 300 నిమిషాలు. వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఈ డివైజ్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతానికి షార్ప్ ఎస్‌హెచ్ - 06డి స్మార్ట్‌ఫోన్‌లను ప్రత్యేకించి జపాన్‌కు మాత్రమే లిమిటెడ్ ఎడిషన్‌లో తయారుచేసినట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. ధర ఇతర విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.


Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot