డిజిటల్ కెమెరా కంటే, ఫోన్ కెమెరా ఎందకంత బెస్ట్..?
కెమెరా సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో రోజురోజుకు గిరాకీ పెరుగుతోన్న నేపథ్యంలో ప్రొఫెషనల్ డిజిటల్ కెమెరాలకు జనాదరణ తగ్గుతోంది.

Read More : సామ్‌సంగ్, మోటరోలా, హెచ్‌టీసీ ఫోన్‌ల పై భారీ తగ్గింపు...
ఇందుకు కారణం డిజిటల్ కెమెరాల కల్పించలేని సౌకర్యాలు స్మార్ట్‌ఫోన్‌లు కల్పించటమే. DSLR కెమెరాతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ బెస్ట్ అనటానికి పలు ఆసక్తికర కారణాలను ఇప్పుడు చూద్దాం..

బల్కీ కెమెరాలను క్యారీ చేయటం కంటే..
మంచి రిసల్యూషన్ క్వాలిటీ కెమెరాతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లను అన్ని వేళలా మీతో తీసుకువెళ్లవచ్చు. ఇదే సమయంలో బల్కీ కెమెరాలను క్యారీ చేయటం కదరదు. డిజిటల్ కెమెరాలను మోసుకెళ్లేందుకు ప్రత్యేకమైన బ్యాగ్ అవసరమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో ఇలాంటివేవి ఉండవు. సింపుల్ గా మీ జేబులో పెట్టేసుకోవచ్చు.

ఏకాగ్రతతో తీయాల్సి వచ్చే కొన్ని కఠినమైన షాట్‌లకు..
ఏకాగ్రతతో తీయాల్సి వచ్చే కొన్ని కఠినమైన షాట్‌లకు డీఎస్ఎల్ కెమెరాలతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ చాలా హ్యాండీగా ఉంటుంది. ఇరుకైన ప్రదేశాల్లో డీఎస్ఎల్ కెమెరాతో సాధ్యంకాని ఫోటో షూట్‌ను స్మార్ట్‌ఫోన్ కెమెరాతో చేపట్టవచ్చు.

Android, iOS వంటి ప్రముఖ ఆపరేటింగ్ సిస్టమ్స్..
Android, iOS వంటి ప్రముఖ ఆపరేటింగ్ సిస్టంలు తమ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం రకరకాల ఫోటో సెంట్రిక్ యాప్స్‌ను అందిస్తున్నాయి. ఈ యాప్స్ సహాయంతో ఫోటోలను అత్యుత్తమ ఎడిట్ చేసుకోవటంతో పాటు అదనపు యానిమేషన్‌లను యాడ్ చేసుకోవచ్చు. డిజిటల్ కెమెరాలలో ఈ సౌకర్యాలు తక్కువ.

అందుబాటులో అనేక ఉపకరణాలు..
స్మార్ట్‌ఫోన్ కెమెరాలను ప్రొఫెషనల్ కెమెరాలుగా తీర్చిదిద్దే అనేక ఉపకరణాలు మార్కెట్లో సిద్దంగా ఉన్నాయి. వీటిని అవసరమైనపుడు ఫోన్ కెమెరాకు ఫిట్ చేసుకుని ప్రొఫెషనల్ స్థాయిలో అనుభూతులతో ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు.

నిరంతరం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి..
డిజిటల్ కెమెరాలతో పోలిస్తే స్మార్ట్‌పోన్ కెమెరాలు నిరంతరం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. స్మార్ట్‌పోన్ కెమెరాతో షూట్ చేసే ఫోటోలను సెకన్ల వ్యవధిలో షేర్ చేయవచ్చు. అన్నిడిజిటల్ కెమెరాలతో ఇది సాధ్యం కాదు.

చక్కటి ప్రాక్టీస్..
ఫోటోగ్రఫీ రంగంలో పట్టు సాధించాలనుకునే వారికి స్మార్ట్‌పోన్ ఫోటోగ్రఫీ చక్కటి ప్రాక్టీస్. స్మార్ట్‌పోన్ ఫోటోగ్రఫీతో రకరకాల ప్రయోగాలను చేయవచ్చు.


Click it and Unblock the Notifications








