దుమ్మురేపే స్పెక్స్‌తో Lyf F1 స్మార్ట్‌ఫోన్

రిలయన్స్ లైఫ్ నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. LYF F1 పేరుతో విడుదలైన ఈ VoLTE స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,399. వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ సామర్థ్యంతో బెటర్ బ్యాటరీ బ్యాకప్ క్వాలిటీతో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

Read More : 4G Volte ఫోన్‌ల పై దీపావళి ఆఫర్స్ ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 64 బిట్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్,

ర్యామ్, స్టోరేజ్..

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా..

16 మెగా పిక్సల్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

కనెక్టువిటీ ఫీచర్లు..

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ స్టీరియో జాక్). ప్రత్యేకమైన స్మార్ట్ రింగ్ టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్ ను సైలెంట్ మోడ్ లో ఉన్నప్పటికి ట్రేస్ చేయవచ్చు.

బ్లుటూత్ స్పీకర్‌ను ఉచితంగా...

రిలయన్స్ ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై రూ.3,000 విలువ చేసే బ్లుటూత్ స్పీకర్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తుంది. సిటీబ్యాంక్ కార్డ్ హోల్డర్స్‌కు అదనంగా 10 క్యాష్‌బ్యాక్‌ను రిలయన్స్ ఆఫర్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Should you buy the latest Reliance Lyf F1 smartphone?. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot