సెప్టంబర్‌లో.. మీముందుకు!

By Prashanth
|
SICT


ఫీచర్ ఫోన్‌ల నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న దేశీయ మొబైల్ తయారీ సంస్థ సిక్ట్(SICT), స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ కంప్యూటర్ల విభాగంలోకి ప్రవేశించనుంది. ఈ ఏడాది సెప్టంబర్‌లో వీటిని ప్రవేశపెట్టేందుకు సంస్థ కసరత్తులు చేస్త్తోంది. ఈ అంశం పై కంపెనీ ముఖ్య నిర్వహణాధికారి అశ్విని కుమార్ మాట్లాడుతూ తాము రూపొందిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇంకా టాబ్లెట్ పీసీ ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆధారితంగా పనిచేస్తాయని తెలిపారు. టాబ్లెట్ ‘3జీ సిమ్’ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. వీటి ధరలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

పోటీ తీవ్రతరం:

దేశీయ సంస్థలైన లావా, కార్బన్, మైక్రోమ్యాక్స్, స్పైస్, ఐబాల్‌లు ఇప్పుటికే ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లు రూపొందించి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి. తాజాగా బరిలోకి దిగిన సిక్ట్ వీటి పోటీని ఏవిధంగా తట్టుకుంటుందో చూడాలి.

80 రోజుల బ్యాటరీ బ్యాకప్?

వ్యాపారం.. ఉద్యోగ రిత్యా తరచూ దూర ప్రాంతాలు ప్రయాణించే వారికి మొబైల్ బ్యాటరీ బ్యాకప్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వీరి సఖ్యతను దృష్టిలో ఉంచుకుని ‘ఎస్ఐసిటి’(SICT) 80 రోజుల బ్యాకప్ నిచ్చే మొబైల్‌ను రూపొందించింది. ‘iV198’గా రూపుదిద్దుకున్న ఈ మొబైల్‌‌లో శక్తివతంతమైన 4000 బ్యాటరీని దోహదం చేశారు. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ 36 గంటల టాక్‌టైమ్‌ నివ్వటంతో పాటు 80రోజుల ధీర్ఘమైన బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఫోన్ జనరల్ ఫీచర్లను పరిశీలిస్తే 2.6 అంగుళాల స్ర్కీన్ మన్నికైన రిసల్యూషన్‌తో ఉంటుంది. ఏర్పాటు చేసిన 1.3 మెగా పిక్సల్ కెమెరా నాణ్యమైన వీడియో రికార్డింగ్‌కు దోహదపడుంది. లోడ్ చేసిన మీడియ ప్లేయర్ వినోదపు అవసరాలను మెరుగైన అనుభూతితో తీరుస్తుంది. దాదాపు అన్ని విధాలైన ఆడియో, వీడియో ఫార్మాట్‌లను మీడియా ప్లేయర్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బాహ్య మెమరీ (ఎక్స్‌టర్నల్ మెమరీ ) 16జీబి కీలక సమచారాన్ని పదిల పరుచుకునేందుకు దోహదపడుంది, డివైజ్‌లో నిక్షిప్తం చేసిన బ్లూటూత్ వ్యవస్థ వేగవంతమైన డేటా షేరింగ్‌కు తోడ్పడుతుంది.

లోడ్ చేసిన అదనపు ఫీచర్లు:

మొబైల్ ట్రాకర్, ఆడియో రికార్డింగ్, టార్చ్‌లైట్, కాల్స్‌ను బ్లాక్ చేసేందుకు బ్లాక్ లిస్ట్ ఫీచర్, ఫోన్ బుక్, మెసేజ్ ప్రొటక్షన్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X