ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ 80 రోజులు..?

వ్యాపారం అదే విధంగా ఉద్యోగ రిత్యా తరచూ దూర ప్రాంతాలు ప్రయాణించే వారికి మొబైల్ బ్యాటరీ బ్యాకప్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వీరి సఖ్యతను దృష్టిలో ఉంచుకుని ‘ఎస్ఐసిటి’(SICT) 80 రోజుల బ్యాకప్ నిచ్చే మొబైల్‌ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.
‘iV198’గా వస్తున్న ఈ మొబైల్‌లో శక్తివతంతమైన 4000 బ్యాటరీని దోహదం చేశారు. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ 36 గంటల టాక్‌టైమ్ నివ్వటంతో పాటు 80రోజుల ధీర్ఘమైన బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఫోన్ జనరల్ ఫీచర్లను పరిశీలిస్తే 2.6 అంగుళాల స్ర్కీన్ మన్నికైన రిసల్యూషన్‌తో ఉంటుంది.
ఏర్పాటు చేసిన 1.3 మెగా పిక్సల్ కెమెరా నాణ్యమైన వీడియో రికార్డింగ్‌కు దోహదపడుంది. లోడ్ చేసిన మీడియ ప్లేయర్ వినోదపు అవసరాలను మెరుగైన అనుభూతితో తీరుస్తుంది. దాదాపు అన్ని విధాలైన ఆడియో, వీడియో ఫార్మాట్‌లను మీడియా ప్లేయర్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బాహ్య మెమరీ (ఎక్స్‌టర్నల్ మెమరీ ) 16జీబి కీలక సమచారాన్ని పదిల పరుచుకునేందుకు దోహదపడుంది, డివైజ్‌లో నిక్షిప్తం చేసిన బ్లూటూత్ వ్యవస్థ వేగవంతమైన డేటా షేరింగ్‌కు తోడ్పడుతుంది.
లోడ్ చేసిన అదనపు ఫీచర్లు:
మొబైల్ ట్రాకర్, ఆడియో రికార్డింగ్, టార్చ్‌లైట్, కాల్స్‌ను బ్లాక్ చేసేందుకు బ్లాక్ లిస్ట్ ఫీచర్, ఫోన్ బుక్, మెసేజ్ ప్రొటక్షన్, ధర రూ.2,600 (అంచనా మాత్రమే).


Click it and Unblock the Notifications








