ఫిబ్రవరిలో ఐవీకే వారి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు!!

Posted By: Staff

ఫిబ్రవరిలో ఐవీకే వారి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు!!

 

ఇండియన్ మొబైల్ మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ ను మూటకట్టకున్న ఐవీకే మొబైల్స్ (IVK Mobile) వచ్చే జనవరిలో రెండు హై - ఎండ్ స్మార్ట్ ఫోన్లను  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతర్జాతీయ సంస్థ SICTతో కుదర్చుకున్న ఒప్పందం మేరకు ఐవీకే  ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఐవీకే మొబైల్స్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అనిల్ కౌషిక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆండ్రాయిడ్ వర్షన్ ఆధారితంగా పని చేసే ఈ స్మార్ట్ ఫోన్ల కాన్ఫిగరేషన్ అంశాలు. 4.3 అదే విధంగా 5 అంగుళాల  స్ర్కీన్ సైజు వేరియంట్లలో  డిజైన్ కాబడిన  ఈ  రెండు డివైజుల్లో ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డ్  ఆపరేటింగ్ సిస్టంను లోడ్ చేశారు. ప్రాసెసింగ్ అంశాలను పరిశీలిస్తే శక్తివంతమైన 1GHz ప్రాసెసర్లను డివైజుల్లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. 2012 జనవరి లేదా ఫిబ్రవరిలో  విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు రూ.15,000లోపు ఉంటాయి.

స్మార్ట్ ఫోన్ల విడుదల నేపధ్యంలో ఉత్సాహంతో ఉన్న ఐవీకే మొబైల్స్ వెను వెంటనే ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీని విడుదల చేసేందుకు  వ్యూహరచన చేస్తుంది.  ఈ డివైజులు దేశంలోని  అన్ని ప్రాంతాలలో  లభ్యమయ్యే విధంగా ఐవీకే యాజమాన్యం టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు,  అదే విధంగా రిటైల్ అవుట్ లెట్లతో సంప్రదింపులు జరుపుతోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot