తక్కువ ధరలో 'ఆల్కాటెల్' ఆండ్రాయిడ్ ఫోన్

Posted By: Super

తక్కువ ధరలో 'ఆల్కాటెల్' ఆండ్రాయిడ్ ఫోన్

కొన్ని మొబైల్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లో మంచి పేరు ఉన్నప్పటికీ ఇండియన్ మొబైల్ మార్కెట్లో అంతంత మాత్రమే బిజినెస్‌ని చేస్తుంది. అలాంటి మొబైల్ కంపెనీలలో ఆల్కాటెల్ మొబైల్ కంపెనీ ఒకటి. ఇందులో భాగంగానే ఇండియన్ మొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకను సంపాదించుకునేందుకు గాను ఆల్కాటెల్ మొబైల్స్ కొత్త మొబైల్‌ని విడుదల చేయనుంది. దాని పేరు 'వన్ టచ్ ఓటి-918డి'. 'వన్ టచ్ ఓటి-918డి' మొబైల్ ప్రత్యేకతలను గనుక క్షణ్ణంగా గమనించినట్లేతే..

'ఆల్కాటెల్ వన్‌టచ్ ఓటి-918డి'  మొబైల్ ప్రత్యేకతలు:

* GSM Quad band (850/900/1800/1900)UMTS 900/2100

* Google Android 2.3 Gingerbread OS

* 3.2 inch TFT 262k Colour Capacitive Touchscreen Display

* 320 x 480 pixels screen resolution

* Internal Memory

* Up to 32GB External Memory Support

* 3.2 Megapixel Camera

* Assisted GPS

* Multi Format Audio/Video Player

* FM Radio

* 3.5 mm audio jack

* Wi-Fi

* USB

* WAP

* Bluetooth data conectivity

* Social Networking Apps

* Android Market

'ఆల్కాటెల్ వన్ టచ్ ఓటి-918డి'  మొబైల్ చుట్టుకొలతలు 112 mm x 58.6 mm x 12.1 mm కాగా, మొబైల్ బరువు 123 గ్రాములు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 3.1 ఇంచ్‌లుగా పుల్ టచ్ స్క్రీన్‌ని  రూపొందించడం జరిగింది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను 650 MHz మీడియా టెక్ MT 6573 ప్రాససెర్‌ని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది.

256 MB RAM ప్రత్యేకం. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 512 MB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని విస్తరించుకోవచ్చు. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్ 3.0, వై - పై లను సపోర్ట్ చేస్తుంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి త్వరలో విడుదల కానున్న దీని ధరను ఇంకా వెల్లడించ లేదు. ఆల్కాటెల్ వన్ టచ్ ఓటి-918డి మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.3 జింజర్ బ్రెడ్‌తో రన్ అవుతుంది.

మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లయేర్స్ సపోర్ట్ చేస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot