Home
Mobile

పొట్టి ఐఫోన్ మార్కెట్లో దిగింది : మిగతా ఫోన్లకు చుక్కలేనా..

By Hazarath

ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న పొట్టి ఐఫోన్ ఐఫోన్ఎస్ఈను ఆపిల్ కంపెనీ ఈ రోజు మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్ రాకతో ఐఫోన్ 5ఎస్ ధరలు భారీస్థాయిలో తగ్గుతాయని కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..అయితే ఎట్టకేలకు మార్కెట్లో తన వాటా శాతాన్ని పెంచుకునేందుకు ఈ ఫోన్ ను మార్కెట్లోకి దించుతోంది. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలుచేసే, అమ్మకాలు జరిపే చైనాలో తొలుత ఈ ఫోన్లను మొట్టమొదటగా దించనుంది. అక్కడి నుంచి ఇత మార్కెట్లకు ఈ ఫోన్ రానుంది.దీని ప్రత్యేకతలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: రూ. 12వేలకు ఐఫోన్ 5ఎస్: ఐఫోన్ కోసం పసికందును..

1

1

దిగ్గజ మొబైల్ సంస్థ ఆపిల్ నుంచి వస్తున్న ఐఫోన్ ఎస్ఈ ఫొటోలు లీకయ్యాయి. లీకయిన ఫోటోల ప్రకారం కొత్తగా వస్తున్న ఎస్ఈ ఫోన్ రోస్ గోల్డ్ ఛాయతో ఉండనుంది.

 

 

2

2

2013లో ఐ ఫోన్ 5ఎస్ మాదిరి నాలుగు అంగుళాల సైజులో కొత్త ఐఫోన్ వస్తుందని వినిపించిన వదంతులు వాస్తవమే అని నిర్ధారణ అయ్యినట్లు తెలుస్తోంది.

 

 

3

3

అంతేకాకుండా 2015లో విడుదల చేసిన ఐఫోన్ 6ఎస్ మాదిరిగా ఫోన్ కోణాలు గుండ్రంగా ఉండేలా ఐఫోన్ ఎస్ఈని తీసుకొస్తున్నట్లు తెలిసింది.

 

 

4

4

ఫొటోల్లో ముదురు ఆరెంజ్ కలర్లో ఈ ఫోన్ కనిపిస్తున్న వాస్తవానికి మాత్రం రోజ్ గోల్డ్ రంగులో ఉండనుందని వీడియో ద్వారా తెలుస్తోంది. మార్చి 21న ఐఫోన్ ఎస్ఈ వస్తుందని, ఎస్ఈ అంటే స్పెషల్ ఎడిషన్ అని రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే.

 

 

5

5

ప్రధాన కెమెరా 12 మెగాపిక్సల్ , 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఏ 9 ప్రాసెసర్

 

 

6

6

ఆపిల్ పే చెల్లింపుల కోసం నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్(ఎన్ఎఫ్‌సీ), 16 జీబీ, 64 జీబీ స్టోరేజ్ వెర్షన్

 

 

7

7

ఇటీవల కాలంలో ఐఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో యాపిల్ సంస్థ ఆమేరకు ఏర్పడిన సేల్స్ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు, సంస్థ ఫోన్ల పట్ల కొనుగోలుదారులకు తగ్గిన ఆసక్తిని కలిగించేందుకు ఈ కొత్త ఫోన్‌ని రంగంలోకి దించుతోంది. మొదటగా చైనాలో అనంతరం ఇతర మార్కెట్లకు విస్తరించనుంది.

8

8

ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమైతే యాపిల్ నుంచి వస్తున్న రెండోతరం ఫోన్‌‌గా దీన్ని చెప్పవచ్చు. 2013 లో ఐ ఫోన్ 5 ఎస్, 5 సీ ఫోన్‌ను తీసుకొచ్చి మార్కెట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. యాపిల్ సంస్థ ఇప్పటి వరకు విడుదల చేసిన ఫోన్లలో అతి తక్కువ సైజు ఫోన్ కూడా ఇదే.

9

9

కాగా, ఇదే ఫోన్ సైజులో కొత్త పరిజ్ఞానం జోడించి ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ (యస్ఈ) గా తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందనే విషయం కంపెనీ ఇప్పటి వరకు చెప్పకపోయినా శ్యామ్ సంగ్ లాంటి ఫోన్లను ఢీకొనెలా ఉండనుందని, దీని అమ్మకాల సాయంతో మరోసారి యాపిల్ వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నారు.

10

10

పెద్ద స్క్రీన్ లు ఉన్న ఫోన్లు ఇష్టం లేని వారికి ఐఫోన్ ఎస్ఈ పెద్ద ఫోన్ ఇచ్చేటన్నీ ఫీచర్స్ అందిస్తూ మంచి అపగ్రేడేషన్ తో ముందుకు రానుంది' అని బాబా ఓ డానెల్ అనే ఐఫోన్ టెక్నాలజీ అధ్యయనకారుడు చెప్పాడు.

10

10

5 ఎస్, 5 సీ తర్వాత యాపిల్ మరోసారి ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ అనే ఫోన్లను 5.5 అంగుళాల సైజుతో తీసుకొచ్చింది. అయితే, ఈఫోన్లు శ్యామ్ సంగ్ ఫోన్లను పోలి ఉండడంతోపాటు గెలాక్సీ ఫోన్ మాదిరిగా బిగ్ స్క్రీన్ తో ఉండటంతో పెద్దగా వినియోగదారులను ఆకట్టుకోలేకపోయాయి.

12

12

ఈ నేపథ్యంలో ఈ ఖాళీని భర్తీచేసేందుకు ఐఫోన్ ఎస్ఈని తీసుకొస్తోంది. అంతేకాదు ఓ కొత్త యాపిల్ ఐపాడ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. 5 ఎస్, 5 సీ ఫోన్లను ఇప్పటికే ఉపయోగిస్తున్నవారు తిరిగి వేరే ఫోన్ల కోసం వెళ్లకుండా చేసేందుకు ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు తెలిసింది.

Best Mobiles in India

English summary
Here Write Smaller iPhone expected Monday as Apple counters drop in phone sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X