‘లక్ష్మీ’కి మార్కెట్లో ఎమ గిరాకీ..!!

Posted By: Staff

‘లక్ష్మీ’కి మార్కెట్లో ఎమ గిరాకీ..!!

‘సాంకేతిక వస్తు తయారీలో ’లో ఓనమాలు దిద్దుకుంటున్న సొంతగూటి కంపెనీలు అదును చూసి పంజాను విసురుతున్నాయి. భారతీయ కంపెనీ అయిన ‘లక్ష్మి యాక్సిస్ కమ్యూనికేషన్’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలస్తుంది. ఈ సంస్థ నిర్వహించిన ప్రత్యేక సర్వే అనంతరం టాబ్లెట్ పీసీలను మార్కెట్లో విడుదల చేసి తన సత్తాను చాటుకుంది. చైనాలో తయారుకాబడ్డ ఈ టాబ్లెట్లు ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉన్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ల మార్కెట్ పై దృష్టిసారించిన ‘లక్ష్మీ కమ్యూనికేషన్స్’ ఆండ్రాయిడ్ ఆధారితంగా తీర్చిదిద్దిన ‘లాక్స్ మ్యాగ్నమ్ మర్చీ 5’ (LACS Magnum Mirchi 5) స్మార్ట్ మొబైల్‌ను ఈ సెప్టంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

బెంగుళూరు కంపెనీ అయిన లక్ష్మీకమ్యూనికేషన్స్ అత్యాధునిక సాంకేతిక పరికాలను సమంజసమైన ధరలకు అందించేందుకు కృషిచేస్తుంది. విడుదల కాబోతున్న ‘మిర్చీ 5’ విశేషాలను పరిశీలిస్తే 5 అంగుళాల డిస్ ప్లే కలిగిన స్ర్కీన్, ‘డెల్ స్ట్రీక్’ మొబైల్ పోలిక కలిగి ఉంటుంది. 1GHz సామర్థ్యం కలిగిన సీపీయూ, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ, 512 ఎంబీ స్టోరేజి కెపాసిటీ, 512 ఎంబీ సామర్ధ్యం కలిగిన ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా వంటి అంశాలు వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

ప్రత్యేక ఫీచర్లను పరిశీలిస్తే ఎఫ్‌‌ఎమ్ రేడియో యుటిలిటీ, లైట్ సెన్సార్, ఇ - కంపాస్, యాక్సిలరోమీటర్, ఆటో రొటేట్ వంటి అంశాలు ఆధునిక వ్యవస్థతో రూపొందించారు. పొందుపరిచిన బ్లూటూత్ డివైజ్ డాటా ట్రాన్స్‌ఫర్‌ను మరింత వేగవంతంగా నడిపిస్తుంది. పొందుపరిచిన అపడేటడ్ వై - ఫై వ్యవస్థ పటిష్టమైన కనెక్టువిటీ కలిగి ఉంటుంది. ఇక మార్కెట్ విషయానికి వస్తే ఎల్జీ ఆప్టిమస్, హెచ్ టీసీ, మైక్రో మ్యాక్స్, శ్యామ్ సంగ్, స్పైస్ వంటి బ్రాండ్ల నుంచి లక్ష్మికి గట్టి పోటీ ఎదురవనుంది. అయితే ‘మిర్చీ 5’ మార్కెట్ ధర రూ.20,000 ఉండవచ్చని తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot