వొడాఫోన్ 3జి ఆధారిత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్!!!

Posted By: Prashanth

వొడాఫోన్ 3జి ఆధారిత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్!!!

 

భారతీయ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి రంగప్రేవశం చేసిన వొడాఫోన్ (Vodafone) ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ దిన దిన ప్రగతిని సాధిస్తోంది. స్మార్ట్ (Smart) పేరుతో వొడాఫోన్ 3జి నెటవర్కింగ్‌కు ఉపకరించే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ మొబైల్‌ను కోనుగోలు చేసే వినియోగదారుడు హై‌స్పీడ్ ఇంటర్నెట్‌ను సౌకర్యవంతంగా యాక్సిస్ చేసుకోవచ్చు...

క్లుప్తంగా ఫీచర్లు:

- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎస్ 1 ప్రాసెసర్,

- ఫుల్ 3జి సపోర్ట్,

- ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ వర్షన్ 2.2.1,

- స్ర్కీన్ సైజ్ 2.1 అంగుళాలు,

- టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

- 2 మెగా పిక్సల్ కెమెరా,

- వీడియో రికార్డింగ్ సౌలభ్యత,

- 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ,

- 2జీబి మెమరీ కార్డ్,

- మీడియో ప్లేయర్,

- ఇంటిగ్రేటెడ్ ఎఫ్ఎమ్ రేడియో,

- సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్లను ముందుగానే ఫోన్‌లో లోడ్ చేశారు,

- ప్రయాణ సందర్భంలో సైతం వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందుకోవచ్చు,

- ధర రూ.5000 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot