స్మార్ట్రాన్ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘t.phone P’

Posted By: BOMMU SIVANJANEYULU

ఎస్‌ఆర్‌టీ.ఫోన్ (srt.phone) పేరిట గతంలో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన స్మార్ట్రాన్ (Smartron) కంపెనీ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టబోతోంది. టీ.ఫోన్ పీ (t.phone P) పేరుతో ఈ బ్రాండ్ లాంచ్ చేయబోతోన్న నూతన
స్మార్ట్‌ఫోన్ జనవరి 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ధర రూ.7,999.

స్మార్ట్రాన్ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘t.phone P’

ఫోన్ స్పెసిఫికేషన్స్.. 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ VoLTE కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ డిజైన్ అండ్ డిస్‌ప్లే ఎలా ఉంది..?

స్మార్ట్‌ఫోన్ టీ.ఫోన్ పీ యూజర్ చేతుల్లో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. ఈ ఫోన్ ఆఫర్ చేసే గ్రిప్ కంఫర్టబుల్ ఫీల్‌ను చేరువచేస్తుంది. లైట్ వెయిట్‌కు తోడు గుండ్రటి కార్నర్స్ ఫోన్‌కు ప్రొఫెషనల్ లుక్‌ను తీసుకువచ్చాయి. ఈ డివైస్ ఎస్‌ఆర్‌టీ.ఫోన్‌లా కాకుండా పూర్తిస్థాయి మెటల్ బాడీతో వస్తోంది. ఈ
ఫోన్‌కు సంబంధించి పవర్ బటన్స్ అలానే వాల్యుమ్ రాకర్స్ కుడిచేతి భాగంలో, హైబ్రీడ్ సిమ్ ట్రేను ఎడమ చేతి వైపు భాగంలో ఏర్పాటు చేసారు.

ఫోన్ పై భాగంలో 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌ను, మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ పోర్టును క్రింది భాగంలో పొజీషన్ చేసి ఉంచారు. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 5.2 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేకు, 2.5డి కర్వుడ్ గ్లాస్ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేస్తున్న విజువల్స్ మొదటి లుక్‌లో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇదే సమయంలో వ్యూవింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్...

రూ.8,000 బడ్జెట్‌లో అందుబాటులో ఉంచిన ఈ స్మార్ట్‌ఫోన్‌కు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్ ఓ హైలైట్‌గా నిలుస్తుంది. దీనికి తోడు 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ప్రాసెసింగ్ అలానే మల్టీటాస్కింగ్ విభాగాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ ఫోన్ పై అదనంగా 1000జీబి క్లౌడ్ స్టోరేజ్‌ను స్మార్ట్రాన్ సంస్థ ఉచితంగా అందిస్తోంది. డ్యుయల్ నానో సిమ్‌లకు తోడు ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ వీక్ పేరిట భారీ డిస్కౌంట్లు, ఈ ఫోన్ల పైనే..

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా...

టీ.ఫోన్ పీ హ్యాండ్‌సెట్‌లో రెండు అప్‌డేటెడ్ కెమెరాలను స్మార్ట్రాన్ పొందుపరిచింది. ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఎల్ఈడి ఫ్లాష్ లైట్ సపోర్ట్‌తో తక్కువ వెళుతరులోనూ హై-క్వాలిటీ ఫోటోలను ప్రొడ్యూస్ చేస్తోంది.

బ్యూటిఫై మోడ్, పానోరమా, టైమ్ ల్యాప్స్, మల్టీ ఎక్స్‌పోజర్, బరస్ట్ వంటి ప్రత్యేకమైన మోడ్స్‌ను ఈ కెమెరా యాప్‌లో అందుబాటులో ఉంచారు. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను టీ.ఫోన్ పీ కలిగి ఉంది.

బ్యాటరీ ఇంకా సాఫ్ట్‌వేర్ పనితీరు..

టీ.ఫోన్ పీ హ్యాండ్‌సెట్‌కు 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఫుల్ చార్జ్ పై దాదాపు 15 రోజుల స్టాండ్‌‌ బై టైమ్‌ను ఈ బ్యాటరీ అందించగలుగుతుందట. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది.

చివరి మాటలు..

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌కు బిగ్ బ్యాటరీతో పాటు డిజైనింగ్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఇంచుమించుగా ఇదే బడ్జెట్‌లో లభ్యమవుతోన్న మైక్రోమాక్స్ భారత్ 5, ఇన్‌ఫోకస్ టర్బో 5 వంటి స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఈ డివైస్‌కు తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశముంది. స్మార్ట్రాన్ టీ.ఫోన్ పీ అఫీషియల్‌గా మార్కెట్లో లాంచ్ అయిన తరువాత పూర్తి రివ్యూను మీకందించటం జరుగుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The new smartphone comes with a massive 5,000 mAh battery that is touted to deliver up to 350 hours of standby time. The handset also comes equipped with OTG support, Wi-Fi, Bluetooth and 4G VoLTE connectivity.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot