బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే దిగిపోతుందా..? 6 ముఖ్యమైన కారణాలు

స్మార్ట్‌ఫోన్ యూజర్లను ప్రధానంగా వేధిస్తోన్న సమస్య బ్యాటరీ బ్యాకప్. అది ఐఫోన్ కావొచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్ కావొచ్చు. బ్యాటరీ బ్యాకప్ సరిగ్గా లేకుంటే ఏ ఫోన్ అయిన దండగే. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు లిథియం ఐయాన్ బ్యాటరీలతో వస్తున్నాయి.

బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే దిగిపోతుందా..? 6 ముఖ్యమైన కారణాలు

పనితీరు పరంగా ఇవి భాగానే స్పందిస్తున్నప్పటికి వీటి ని వినియోగించుకునే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. లిథియం ఐయాన్ పరిమితికి మించి ఛార్జ్ చేయకూడదని అదే సమయంలో ఛార్జింగ్ 20శాతానికి పడిపోకుండా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ లల బ్యాటరీ బ్యాకప్ వెంటనే దిగిపోవటానికి 6 ముఖ్యమైన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్ర్కీన్ బ్రైట్నెస్...

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ డ్రెయిన్ అవటానికి ప్రధానమైన కారణం స్ర్కీన్ బ్రైట్నెస్. మీ ఫోన్ స్ర్కీన్ బ్రైట్నెస్ హైలో ఉన్నట్లయితే ఫోన్ బ్యాటరీ బ్యాకప్ మీకు తెలియకుండానే దిగిపోతుంది. కాబట్టి, స్ర్కీన్ బ్రైట్నెస్ ను ఎప్పటికప్పుడ తగ్గించుకోవటం ద్వారా బ్యాటరీ శక్తిని ఆదా చేసుకోవచ్చు.

వై-ఫై నెట్‌వర్క్ వినియోగం..

మొబైల్ డేటా బిల్‌ను తగ్గించటంలో వై-ఫై వినియోగం కీలక పాత్ర పోషించినప్పటికి వై-ఫై నెట్‌వర్క్‌ను పదేపదే మీ ఫోన్‌లో ఎనేబుల్ చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్ త్వరత్వరగా ఖర్చయిపోతుంటుంది.

బ్యాక్‌గ్రౌండ్‌‌లో రన్ అయ్యే యాప్స్

మనకు తెలియకుండా ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌‌లో రన్ అయ్యే యాప్స్ కూడా బ్యాటరీ శక్తిని ఆవిరిచేసేస్తుంటాయి. సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి వీటిని చెక్ చేసుకోవటం ద్వారా బ్యాటరీ శక్తిని ఆదా చేసుకోవచ్చు.

పవర్ మేనేజ్‌మెంట్ యాప్స్ వల్ల ప్రయోజనం ఉండదు..

చాలా మంది తమ ఫోన్‌లలో బ్యాటరీ పవర్ మేనేజ్‌మెంట్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసేస్తుంటారు. ఇవి బ్యాటరీ బ్యాకప్‌ను పొదుపు చేయటం మాట అలా ఉంచితే బ్యాటరీ శక్తిని మాత్రం ఆవిరి చేసేస్తుంటాయి.

ఆటోమెటిక్ బ్యాకప్ ఆప్షన్..

ఆటోమెటిక్ బ్యాకప్ ఆప్షన్ ఎనేబుల్ చేసి ఉన్న యాప్స్ బ్యాటరీ శక్తిని ఎక్కువుగా ఖర్చు చేసేస్తుంటాయి. ఇందుకు కారణంగ ఇవి నిత్యం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉండటమే.

కొత్త అప్‌డేట్స్ పొందకపోతే..

ఫోన్ తయారీదారులు బ్యాటరీ బ్యాకప్ సమస్యలను నిర్మూలించేందుకు నిత్యం ఓఎస్ అప్‌డేట్‌‌లను లాంచ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఓఎస్ అప్‌డేట్స్ మీరు తీసుకోన్నట్లయితే బ్యాటరీ డ్రెయినింగ్ సమస్య అంతకంతకు పెరిగిపోతుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 reasons your smartphone battery is draining quickly. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting