మోటరోలా ఆట్రిక్స్ వర్సెస్ మోటరోలా మైల్ స్టోన్

Posted By: Super

మోటరోలా ఆట్రిక్స్ వర్సెస్ మోటరోలా మైల్ స్టోన్

ప్రస్తుతం మొబైల్ పరిశ్రమలో ఎక్కడ చూసిన స్మార్ట్ ఫోన్స్ గురించే చర్చ. మోటరోలా, శ్యామ్ సంగ్, సోనీ ఎరిక్సన్ ఇలా ఎన్నో కంపెనీలు వాటి యొక్క స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి కస్టమర్స్‌ని ఆకర్షించేందుకు తక్కువ ధరలలో విడుదల చేస్తున్నాయి. ఈరోజు మోటరోలా కంపెనీ తయారు చేసినటువంటి రెండు స్మార్ట్ ఫోన్స్‌ల గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం. ఇటీవలే మోటరోలా కంపెనీ మోటరోలా ఆట్రిక్స్, మోటరోలో మైల్ స్టోన్ అనే రెండు మొబైల్స్‌ని విడుదల చేసింది.

ఈ రెండు మొబైల్స్ కూడా డిజైనింగ్ విషయంలో కస్టమర్స్‌ ఆకర్షించే విధంగా రూపోందించడం జరిగింది. మోటరోలా ఆట్రిక్స్ పూర్తిగా 4.0 ఇంచ్ ఎల్‌సిడి కెపాసిటివ్ టచ్ స్క్రీన్ కలిగి ఉంది. ఇక మోటరోలా మైల్ స్టోన్ కూడా ఆట్రిక్స్ అంత టచ్ స్క్రీన్ లేకపోయినప్పటికీ 3.7 ఇంచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి, రెండు మొబైల్స్ కూడా ఫిజికల్ క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉన్నాయి.

ఇక కెమెరా విషయంలో కూడా కస్టమర్స్‌ని ఎటువంటి నిరాశకు గురిచేయవు. మంచి పిక్చర్ క్వాలిటీని ఇవ్వడం కోసం రెండు కెమెరాలు కూడా 5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉన్నాయి. కెమెరాతో పాటు ఆటో ఫోకస్, డిజిటల్ జూమ్, ఎల్‌ఈడి ఫ్లాష్ టెక్నాలజీలు ప్రత్యేకం. 3జి నెట్ వర్క్ కోసం సూపర్ ఫాస్ట్‌గా వీడియో కాలింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేసేందుకు గాను మోటరోలా ఆట్రిక్స్‌లో ముందు భాగాన కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. మోటరోలా మైల్ స్టోన్‌లో 720p వీడియో రికార్డింగ్ అందజేస్తుంటే అదే మోటరోలా ఆట్రిక్స్‌లో 1080p వీడియో రికార్డింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది.

మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్నటువంటి అన్ని రకాల వీడియో, ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. ఇక ఎఫ్‌ఎమ్ రేడియో, స్టీరియో స్పీకర్స్, 3.5 mm ఆడియో జాక్ ప్రత్యేకం. ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై లను సపోర్ట్ చేస్తాయి. 3జి డేటా ట్రాన్ఫర్ విషయంలో మోటరోలా ఆట్రిక్స్ 14 Mbps స్పీడ్‌తో ట్రాన్పర్ అవ్వగా, అదే మోటరోలా మైల్ స్టోన్ 7Mbps స్పీడ్‌తో ట్రాన్పర్ చేస్తుంది.

చివరగా ఖరీదు విషయానికి వస్తే మోటరోలా ఆట్రిక్స్ రూ 28,500 ఉండగా అదే మోటరోలా మైల్ స్టోన్ మాత్రం రూ 19,000గా ధరను నిర్ణయించడమైంది. ఈ రెండింటిలో ఏది బెటర్ అని అనుకుంటే మాత్రం మోటరోలా మైల్ స్టోనే బెటర్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot