ఒక్క కెమెరా విషయంలోనే నోకియా ఎక్కువ

Posted By: Super

ఒక్క కెమెరా విషయంలోనే నోకియా ఎక్కువ

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ సెగ్మెంట్‌లో నోకియా, శ్యామ్‌సంగ్ రెండు గట్టిపోటీని ఎదుర్కుంటున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహాం లేదు. మొబైల్ కంపెనీల మద్య ఉన్న పోటీ ఇండియన్ కస్టమర్స్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఇండియన్ మార్కెట్లో బాగా సక్సెస్ సాధించినటువంటి రెండు స్మార్ట్ ఫోన్స్ నోకియా ఎన్9, సోని ఎరిక్సన్ ఎక్స్ పీరియా ప్లే గురించి తెలుసుకుందాం. అసలు ఈ రెండు మొబైల్స్ ఇండియన్ మార్కెట్లో తమ హావాని కోనసాగించడానికి గల కారణాలు ఏంటనేవి తెలుసుకుందాం.

నోకియా ఎన్9 మొబైల్ మీగో ఆపరేటింగ్ సిస్టమ్ మంచి స్టయిలిష్‌గా రూపోందించడం జరిగింది. ఇక సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ప్లే చూస్తే చేతిలో నుండి విడిచిపెట్టలేనటువంటి అందం దాని సోంతం. సోనీ ఎరిక్సన్ మాత్రం ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. మల్టీమీడియా, ఎంటర్టన్మెంట్ ఆఫ్షన్స్‌లో గనుకు చూసినట్లైతే రెండు మొబైల్స్ కూడా ఒకదానికొకటి పోటీగా ఉంటాయి. రెండు మొబైల్స్ కూడా ఆడియా, వీడియో రికార్డింగ్, ప్లేబ్యాక్ సాప్ట్‌వేర్స్‌తో పాటు, ఎఫ్‌ఎమ్ రేడియో, 3.5mm యూనివర్సల్ ఆడియో జాక్ ప్రత్యేకం.

కెమెరా విషయంలో మాత్రం రెండు మొబైల్స్‌లలో తేడా ఉంది. నోకియా ఎన్9 8మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంటే, అదే సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ప్లే‌ 5మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. రెండు మొబైల్స్ కూడా హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ ని 720P పార్మెట్‌ని సపోర్ట్ చేస్తాయి. హై స్పీడ్ 3జి నెట్ వర్క్‌కి వీడియో కాలింగ్‌కి సపోర్ట్ చేయడానికి విజిఎ కెమెరాని ముందు భాగాన పోందుపరచడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కనెక్టివిటీ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై‌ని సపోర్ట్ చేస్తాయి. హై స్పీడ్ 3జి ఇంటర్నెట్‌‌ డేటా ట్రాన్పర్‌ని 21Mbps స్పీడ్‌తో చేస్తుంది.

అన్ని హాంగులతో రూపుదిద్దుకున్న నోకియా ఎన్9 స్మార్ట్ ఫోన్ ఖరీదు సుమారు రూ 32,000కాగా, అదే సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో ప్లే ఖరీదు మాత్రం రూ 28,000గా నిర్ణయిండమైంది. నోకియా అందిస్తున్న అన్ని రకాల ఫీచర్స్‌ని సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ప్లే అందించడంతో పాటు తక్కువ ధరకు లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot