స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

|

ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ డివైజ్ ఏలాంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండాలి..?, ఫోన్ కొనుగోలు సమయంలో ఏఏ అంశాలను నిశితంగా పరిశీలించాలి..? స్మార్ట్‌ఫోన్ ఎంపిక విషయంలో 6 ముఖ్యమైన అంశాలను సూచిస్తూ గిజ్ బాట్ ఓ ప్రత్యేక కథనాన్ని మీముందుకు తీసుకువచ్చింది.

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

1.) ఆపరేటింగ్ సిస్టం:

స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు సదరు డివైజ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ అవగాహనకు రండి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్ కొత్తదిగా ఉంది. మరో వైపు యాపిల్ ఐవోఎస్, బ్లాక్‍‌బెర్రీ 10 ఇంకా విండోస్ 8 ఓఎస్ ఆధారిత డివైజ్‌లు లభ్యమవుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

2.) స్ర్కీన్ సైజ్:

వివిధ స్ర్కీన్ వేరియంట్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్ లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పొడవు 4 అంగుళాల ఉన్నట్లయితే ఇంటర్నెట్ సర్ఫింగ్ ఇంకా స్ర్కీన్ రిసల్యూషన్ బాగుంటుంది.

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?
 
స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

3.) బ్రాండ్ విషయంలో ముందస్తు అవగాహన:

కంపెనీ బట్టి స్మార్ట్ ఫోన్ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫోన్ ఎంపిక సంబంధించి ముందుగానే బ్రాండ్ ఎంచుకోండి.

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

4.) బ్యాటరీ లైఫ్ ఎంతో ముఖ్యం:

మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్ కు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. మీ ట్యాబ్లెట్ 4000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది.

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

5.) అప్లికేషన్స్ ఎక్కువుగా ఉండాలి:

మీరు కొనుగోలు చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నెన్ని అప్లికేషన్‌లు ఉన్నాయో తెలుసుకోండి. మార్కెట్లో లభ్యమవుతున్న ఆధునిక వర్షన్ గాడ్జెట్‌ల‌లో సోషల్ నెట్‌వర్కింగ్ దగ్గర నుంచి హెల్త్‌కేర్ అప్లికేషన్‌ల వరకు ముందుగానే నిక్షిప్తం కాబడి ఉంటున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆలోచనాత్మకంగా వ్యవహరించండి.

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఈ 6 విషయాలు మీకు తెలుసా..?

6.) స్పెసిఫికేషన్స్ ఎంతో కీలకం:

మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మన్నికైన పనితీరును కరబర్చాలంటే 1జీబి ర్యామ్ తప్పనిసిరి. తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకుందామనుకునే వారికి 512ఎంబి ర్యామ్ బెస్ట్ ఛాయిస్. ప్రతస్తు మార్కెట్‌ను పరిగణంలోకి తీసుకున్నట్లియితే ఎల్‌జీ ఇంకా సామ్‌సంగ్‌లు 2జీబి ర్యామ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లో, ర్యామ్ తరువాతి స్థానాన్ని ఆక్రమించింది ప్రాసెసర్. ప్రస్తుత ట్రెండ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ల పై నడుస్తోంది. అయితే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వేగవంతంగా స్పందించాలంటే సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్ సరిపోతుంది. ఇంకా వేగవంతమైన ప్రాసెసింగ్‌ను కోరుకునే వారు తమ సామర్ధ్యాన్ని బట్లి ప్రాసెసర్‌లను ఎంపిక చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X