గోడ చాటు యవ్వారం (ఇంట్రెస్టింగ్ స్టోరీ)!!

By Prashanth
|
Smartphone Camera


టెక్నాలజీ విభాగంలో కొత్త ఒరవడికి నాంది పలికిన స్మార్ట్‌ఫోన్‌లు, డిజిటల్ కెమెరాలు స్థానాలను భర్తీ చేస్తున్నాయి. ఇటీవల యూనివర్శటీ ఆఫ్ టెక్సాస్‌లో నిర్వహించిన ఓ పరిశోధన స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని నూతన స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది.

ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణుల బృందం, విద్యుదయస్కాంత వర్ణపటం (electromagnetic spectrum)లోని టెరాహెట్జ్ బ్యాండ్‌ను ఉపయోగించుకునే విధంగా ఇమేజ్ చిప్‌ను రూపొందించింది. సీఎమ్‌వోఎస్ టెక్నాలజీ ఆధారంగా ఈ చిప్‌ను డిజైన్ చేశారు. బహుళ లెన్సులు (multiple lenses) అవసరం లేకుండా ఈ చిప్ పనిచేస్తుంది.

ఈ కొత్త టెక్నాలజీని స్మార్ట్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేయ్యటం వల్ల గోడకు అటువైపు జరుగుతున్న దృశ్యాలను చిత్రీకరించుకోవచ్చు. నకిలీ నోట్లు గుర్తించటంతో పాటు వస్తువుల్లో నిర్మాణ లోపాలు అదేవిధంగా కణితులు కనుగొనేందుకు ఈ వ్యవస్థ బేషుగ్గా ఉపయోగపడుతుంది. ఆపిల్ తాను రూపొందిచబోయే డివైజుల్లో ఈ అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X