Home
Mobile

స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? జిఎస్‌టి తగ్గింపుతో భారీగా తగ్గనున్న ధరలు.. సెప్టెంబర్ 12న కీలక నిర్ణయం!

జిఎస్‌టి కౌన్సిల్ దాదాపు ఏడాది విరామం తర్వాత సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో సమావేశం కానుంది. పన్ను నిబంధనల సవరణలే ప్రధాన ఎజెండాగా కనిపిస్తున్నప్పటికీ, మొబైల్ ఫోన్లపై ఉన్న 18 శాతం జిఎస్‌టిని తగ్గించే అవకాశముందని బిజినెస్ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. ₹8 వేలు, ₹12 వేలు, ₹15 వేల లోపు లభించే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

అయితే ఈ తగ్గింపు వల్ల వినియోగదారులకు ఎంత మేర లబ్ధి చేకూరుతుంది? ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై 18 శాతం జిఎస్‌టి అమలులో ఉంది. ఒకవేళ దీనిని 12 శాతానికి తగ్గిస్తే, ఫోన్ కొనుగోలుపై దాదాపు 5 శాతం వరకు ధర తగ్గుతుంది. అదే ఒకవేళ 5 శాతానికి తగ్గిస్తే.. ఏకంగా 11 శాతం వరకు లబ్ధి చేకూరుతుంది. అయితే, బ్రాండ్లు లేదా డీలర్లు MRPలు, ఆఫర్లలో చేసే మార్పులను బట్టి ఈ ధరల్లో కొద్దిగా వ్యత్యాసం ఉండవచ్చు.

Smartphone GST Rate Cut: Will Budget Phone Prices Drop After September 12 Council Meeting?

స్మార్ట్‌ఫోన్ జిఎస్‌టి కోత: అసలు కౌన్సిల్ ఎజెండాలో ఏముంది?

అధికారిక ఎజెండా ప్రకారం.. బ్లాక్ చేసిన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, రీఫండ్లు, సులభతర రిజిస్ట్రేషన్ ప్రక్రియలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే స్మార్ట్‌ఫోన్ల డిమాండ్‌ను పెంచడంతో పాటు మేక్ ఇన్ ఇండియా తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు వీలుగా ఫోన్లపై పన్ను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, 2020లో మొబైల్ ఫోన్లపై పన్నును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి పన్ను తగ్గింపుల ప్రయోజనం వినియోగదారులకు ఎంతవరకు అందుతుందనేది కంపెనీల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

GST తగ్గిస్తే.. ₹8k, ₹12k, ₹15k లోపు ఫోన్ల ధరలు ఎలా మారతాయంటే?

విభాగంమోడల్ (వేరియంట్)MRPప్రస్తుత ధరGST 12% అయితేGST 5% అయితేమొత్తం పొదుపు
₹8 వేల లోపుRedmi A3 (4/128)₹10,999₹7,599₹7,590₹7,120₹9–₹479
₹12 వేల లోపుPOCO M6 5G (4/128)₹12,999₹10,499₹9,965₹9,354₹534–₹1,145
₹15 వేల లోపుMoto G64 5G (8/128)₹17,999₹13,299₹12,628₹11,844₹671–₹1,455

ఈ ధరల గణాంకాలు సెప్టెంబర్ 5-6 తేదీల్లోని ఆన్‌లైన్ లభ్యత, బ్యాంక్ ఆఫర్ల ఆధారంగా అంచనా వేసినవి మాత్రమే. (మూలాలు: ఫ్లిప్‌కార్ట్ Redmi A3, Moto G64 పేజీలు మరియు POCO M6 ప్రైస్ ట్రాకర్లు).

ఇప్పుడే కొనాలా? లేదా ‘బిగ్ బచత్ డేస్’ ముగిసేవరకు వేచి చూడాలా?

మీకు అత్యవసరంగా ఫోన్ కావాలంటే.. సెప్టెంబర్ 6 వరకు నడిచే ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బచత్ డేస్' సేల్‌లో బ్యాంక్ డిస్కౌంట్లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు, మొదటిసారి కొనేవారికి ఇది మంచి అవకాశం. ఒకవేళ కొద్దిరోజులు వేచి చూడగలరు అనుకుంటే.. జిఎస్‌టి నిర్ణయం తర్వాత మారే కొత్త MRP ధరలు, రాబోయే అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' నో-కాస్ట్ EMI ఆఫర్లను గమనిస్తూ డెసిషన్ తీసుకోవడం మంచిది.

మేక్ ఇన్ ఇండియా, ఎంట్రీ లెవెల్ 5G ఫోన్లపై ప్రభావం ఎంత?

జిఎస్‌టి తగ్గిస్తే ఎంట్రీ-లెవెల్ 5G ఫోన్ల విక్రయాలు పుంజుకోవడమే కాకుండా, స్థానిక తయారీ పరిశ్రమలకు పెద్ద ఊరట లభిస్తుంది. అయితే, కంపెనీలు ఈ పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు పూర్తిగా బదిలీ చేస్తాయా లేదా అనేది చూడాలి. అందుకే సెప్టెంబర్ 12న వెలువడే జిఎస్‌టి కౌన్సిల్ ప్రకటనపై కన్నేసి ఉంచండి. జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం వెలువడిన వెంటనే ఈ కథనంలో తాజా వివరాలను అప్‌డేట్ చేస్తాం.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X