జీవితకాలం ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంతో డేటావిండ్ ఫోన్

Posted By:

అమ్మకాలను రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో రూ.2,000లకే జీవిత కాల ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రముఖ చవక ధర మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ డేటా విండ్ ప్రకటించింది. దీపావళి కంటే ముందుగానే ఈ కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తామని డేటావిండ్ వెల్లడించింది.

 జీవితకాలం ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంతో డేటావిండ్ ఫోన్

3.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుందుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరికొన్ని  డివైజ్‌లను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు డేటావిండ్ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు 5  టాబ్లెట్‌లను మార్కెట్లో విక్రయిస్తోంది. నెలకు 40 నుంచి 50 వేల స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్లను అమ్ముతున్నట్లు డేటావిండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రూపీందర్ సింగ్ తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot