Home
Mobile

వివో, వన్‌ప్లస్‌, రెడ్‌మి, రియల్‌మి సహా.. డిసెంబర్‌లో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవిగో..!

Smartphone launches in December 2025 : భారత్ మార్కెట్లో నవంబర్‌ నెలలో వన్‌ప్లస్‌, ఐకూ, ఒప్పో నుంచి స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌ తో అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌ లో అనేక మోడల్స్‌ విడుదల అయ్యాయి. అయితే డిసెంబర్‌ లోనూ వివిధ బ్రాండ్‌ లు తమ స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ ను లాంచ్‌ చేయనున్నాయి. ఈ జాబితాలో వన్‌ప్లస్‌, వివో, రెడ్‌మి, రియల్‌మి నుంచి స్మార్ట్‌ఫోన్‌ లు విడుదల కానున్నాయి.

* వివో X300 సిరీస్‌ - (డిసెంబర్‌ 2 వ తేదీ) :
ఈ సిరీస్‌ (Vivo X300 Series) గ్లోబల్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. భారత్‌ మార్కెట్లో డిసెంబర్‌ 2 వ తేదీన విడుదల కానుంది. వివో X300, X300 ప్రో మోడల్స్‌ లాంచ్‌ కానున్నాయి. ఈ సిరీస్‌ విడుదల అనంతరం వివో అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది.

vivo X300 series

వివో X300 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ లు మీడియాటెక్‌ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ తో అందుబాటులోకి రానున్నాయి. కెమెరా విభాగం పరంగా Zeiss భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

* రెడ్‌మి 15C 5G స్మార్ట్‌ఫోన్‌ - (డిసెంబర్‌ 3 వ తేదీ) :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (Redmi 15C 5G Smartphone) డిసెంబర్‌ 3 వ తేదీన విడుదల కానుంది. అమెజాన్‌ ఆధారంగా సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, 120Hz రీఫ్రె‌ష్‌ రేట్‌ తో 6.9 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.

vivo X300 series

* రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌ - (డిసెంబర్‌ 4 వ తేదీ) :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (Realme P4x 5G Smartphone) డిసెంబర్‌ 4 వ తేదీన విడుదల కానుంది. విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌, భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌ తో పనిచేస్తుంది.

* వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్ - (డిసెంబర్‌ 17 వ తేదీ) :
భారత్‌ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ (OnePlus 15R Smartphone) డిసెంబర్‌ 17 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్‌ స్నా్ప్‌డ్రాగన్ 8 జెన్‌ 5 మొబైల్‌ ఫ్లాట్‌ఫాంతో పనిచేస్తుంది. ఈ చిప్‌ తో లాంచ్‌ అయ్యే తొలి ఫోన్‌ గా వన్‌ప్లస్‌ 15R గుర్తింపు పొందనుంది. ఈ ఫోన్ విడుదల అనంతరం అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది.

vivo X300 series

ఈ స్మార్ట్‌ఫోన్‌తోపాటు వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో 2 (OnePlus Pad Go 2 Tablet) కూడా అదే రోజుల విడుదల కానుంది. ఈ ప్యాడ్ షాడో బ్లాక్‌, లావెండర్‌ డ్రిఫ్ట్‌ కలర్ వేరియంట్స్‌ లో అందుబాటులోకి రానుంది. ఆకట్టుకొనే డిజైన్‌తో విడుదల కానుందని వన్‌ప్లస్‌ తెలిపింది.

Best Mobiles in India

English summary
Smartphone launches in december 2025 oneplus 15R, vivo X300 series, Redmi 15c, realme p4x 5G and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X