జనవరి 2026 లో విడుదల కానున్న ఫోన్‌లు ఇవే.. లిస్ట్, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు..!
Smartphone launches in january 2026 : 2025 డిసెంబర్‌లో అనేక ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. జనవరి 2026 నెలలోనూ అనేక ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఇందులో రియల్‌మి, రెడ్‌మి, పోకో, ఒప్పో నుంచి ఫోన్‌లు రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా రియల్‌మి 16 ప్రో సిరీస్, రెడ్‌మి నోట్ 15 5G, పోకో M8, ఒప్పో రెనో 15 సిరీస్ వంటి ఫోన్‌లు విడుదల కానున్నాయి. అయితే త్వరలో మరిన్ని బ్రాండ్‌లు కూడా తమ మోడల్స్‌ను లాంచ్ చేయనున్నాయి.
రియల్‌మి 16 ప్రో సిరీస్ :
రియల్‌మి 16 ప్రో సిరీస్ (Realme 16 Pro Series) జనవరి 6 వ తేదీన లాంచ్ కానుంది. ఇందులో రియల్‌మి 16 ప్రో, రియల్‌మి 16 ప్రో ప్లస్ మోడల్స్ విడుదల కానున్నాయి. ఈ రెండు ఫోన్‌లు మెటల్ ఫినిష్‌ను కలిగి ఉంటాయి. ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులోకి రానున్నాయి.

ఈ సిరీస్ ఫోన్‌లు 200MP కెమెరాను కలిగి ఉంటాయి. ప్రో ప్లస్ మోడల్ 50MP టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ రెండు మోడల్స్ 7000mAh బ్యాటరీతో పనిచేస్తాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. బేస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7000 సిరీస్ చిప్, ప్లస్ మోడల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ రెడ్‌మి ఫోన్ (Redmi Note 15 5G Smartphone) జనవరి 6 వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు 5520mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే ధర వివరాలు వెల్లడి కాలేదు.

పోకో M8 స్మార్ట్‌ఫోన్ :
పోకో M8 స్మార్ట్‌ఫోన్ (Poco M8 5G Smartphone) భారత్ మార్కెట్‌లో జనవరి 8 వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లపై పోకో ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఒప్పో రెనో 15 సిరీస్ :
ఈ ఒప్పో సిరీస్ (OPPO Reno 15 5G Series) జనవరిలోనే విడుదల కానుంది. అయితే కచ్చితమైన విడుదల వివరాలు వెల్లడి కాలేదు. ఈ సిరీస్‌లో భాగంగా రెనో 15, రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మిని స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఈ మూడు ఫోన్‌లు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, HoloFusion టెక్నాలజీని కలిగి ఉంటాయి.
ఒప్పో రెనో 15 5G ఫోన్ 6.59 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే ప్రో మోడల్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ కానుంది. అదే మిని మోడల్ 6.32 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. బేస్, మినీ మోడల్స్ కార్నింగ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతాయి.
అదే ప్రో మోడల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతోంది. అలాగే ఈ మూడు ఫోన్‌లు IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటాయని ఒప్పో వెల్లడించింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications








