Home
Mobile

Smartphone launches in March మార్చి నెలలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్లు.. లిస్ట్‌, ఫీచర్ల వివరాలు..!

భారత్‌ మార్కెట్లో ఫిబ్రవరిలో వివిధ ధరల సెగ్మెంట్స్‌లో అనేక మోడల్స్‌ లాంచ్ అయ్యాయి. శాంసంగ్, గూగుల్ నుంచి ప్రీమియం మోడల్స్‌ కూడా విడుదల అయ్యాయి. అయితే మార్చిలోనూ అనేక స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఇప్పటికే అనేక బ్రాండ్స్‌ తమ స్మార్ట్‌ఫోన్ల విడుదల తేదీలను ప్రకటించాయి. మార్చి నెలలో (Smartphone launches in March) నథింగ్‌, రియల్‌మి, మోటోతోపాటు ఆపిల్ నుంచి కూడా అనేక ఉత్పత్తులు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

AI+ నుంచి గత సంవత్సరం పల్స్‌ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. దీంతోపాటు ఇటీవలే బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌లు విడుదల అయ్యాయి. ఈ సంస్థ నుంచి మరో ఫోన్‌ విడుదల కానుంది. సంస్థ నుంచి వచ్చిన వివరాల ఆధారంగా AI+ పల్స్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది.

smartphone launches in march 2026

నథింగ్‌ ఫోన్‌ 4a సిరీస్‌ :
నథింగ్‌ ఫోన్‌ 4a సిరీస్‌ నుంచి నథింగ్‌ ఫోన్ 4a, 4a ప్రో మోడల్స్‌ లాంచ్‌ కానున్నాయి. భారత్ మార్కెట్‌లో మార్చి 5 వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఈ రెండు ఫోన్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే సంస్థ ఈ ఫోన్ బ్యాక్‌ ప్యానల్ డిజైన్‌ ను విడుదల చేసింది. దీంతోపాటు స్నాప్‌డ్రాగన్ చిప్‌తో పనిచేస్తుందని తెలిపింది.

ఈ సిరీస్‌ ఫోన్లు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటాయి. పిల్‌ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ ఉంటుంది. ఈ ఫోన్‌ గ్లిఫ్‌ బార్‌ లైటింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. నథింగ్ ఫోన్ 4a స్మార్ట్‌ఫోన్ వైట్‌, పింక్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ సిరీస్‌ అందుబాటులోకి రానుంది.

రియల్‌మి నుంచి :
రియల్‌మి నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ కానున్నాయి. మార్చి 5 వ తేదీన రియల్‌మి నార్జో పవర్ 5G ఫోన్‌ విడుదల కానుంది. రియల్‌మి సంస్థ ఇప్పటికే 10001mAh బ్యాటరీతో P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. నార్జో పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా 10001mAh బ్యాటరీని కలిగి ఉంటుందని రియల్‌మి తెలిపింది.

ఈ ఫోన్ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 చిప్‌, HyperVision ప్లస్‌ AI చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 6500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

మార్చి 7 వ తేదీన రియల్‌మి C83 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మిలిటరీ గ్రేడ్ షాక్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. 144Hz రీఫ్రెష్ రేట్‌, IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ :
ఈ ఫోన్ భారత్‌ మార్కెట్‌లో మార్చి 6 వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 68W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ, 13MP కెమెరాలతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఆపిల్‌ నుంచి :
మార్చి నెలలోనే ఆపిల్‌ నుంచి అనేక ఉత్పత్తులు విడుదల కానున్నాయి. ఇందులో ఐఫోన్ 17e తోపాటు బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌ సహా మరిన్ని మ్యాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌లు లాంచ్‌ కానున్నాయని అంచనా వేస్తున్నారు. మార్చి 4 వ తేదీన ఆపిల్‌ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. అయితే ఏయే ఉత్పత్తులు లాంచ్‌ కానున్నాయో వెల్లడి కావాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
smartphone launches in march 2026 in india here is the list and specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X