Upcoming Smartphone launches సెప్టెంబర్‌లో ఏయే స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయంటే..?
Upcoming Smartphone launches : భారత్ మార్కెట్‌లో ఆగస్టు నెలలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. సెప్టెంబర్ నెలలో కూడా అనేక మోడల్స్ విడుదల కానున్నాయి. ఇప్పటికే అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు విడుదల తేదీలను ప్రకటించాయి. ఆపిల్, శాంసంగ్, మోటోరోలా, ఒప్పో, రియల్‌మి, లావా, టెక్నో వంటి మోడల్స్ విడుదల కానున్నాయి.
ఐఫోన్ 17 సిరీస్ :
ఆపిల్ నుంచి ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17 Series) సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. సెప్టెంబర్ 9 రాత్రి 10:30 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది.

ఈ సిరీస్‌లో కొత్తగా ఎయిర్ మోడల్ విడుదల కానుంది. ఈ ఫోన్ 5.5mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. గత సిరీస్‌తో పోలిస్తే డిజైన్ సహా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా అనేక అప్‌గ్రేడ్స్‌తో లాంచ్ కానుందని లీక్స్ వస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S25 FE :
గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను (Galaxy Unpacked 2925) సెప్టెంబర్ 4 వ తేదీ 3 PM IST గంటలకు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో శాంసంగ్ S25 FE స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుందని భావిస్తున్నారు. దీంతోపాటు ట్యాబ్ S11 సిరీస్ కూడా లాంచ్ కానుంది. ఈ ట్యాబ్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.

మోటోరోలా స్పెషల్ ఎడిషన్ :
సెప్టెంబర్ 1 వ తేదీన మోటోరోలా Razr 60 బ్రిలియంట్ కలెక్షన్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేయనుంది. విడుదల అనంతరం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ కూడా లైవ్‌లో ఉంది.
రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 2 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ రియల్‌మి ఫోన్ (Realme 15T Smartphone) లాంచ్ కానుంది. ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలను కలిగి ఉంటుంది. రూ.20 వేల కంటే తక్కువ ధరలో లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది.
టెక్నో పోవా స్లిమ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ (Tecno Pova Slim Smartphone) సెప్టెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. విడుదల అనంతరం టెక్నో ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ అత్యంత సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఒప్పో F31 5G సిరీస్ :
ఈ సిరీస్ (OPPO F31 5G Series) సెప్టెంబర్ నెలలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో F31, ఒప్పో F31 ప్రో, ఒప్పో F31 ప్రో ప్లస్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఈ ఇటీవలే ఈ సిరీస్ గురించి లీక్స్ రాగా.. త్వరలో మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








