ఆపిల్, సామ్‌సంగ్ కేక... నోకియా ఢమాల్!

Posted By: Super

ఆపిల్, సామ్‌సంగ్ కేక... నోకియా ఢమాల్!

2012,2వ త్రైమాసికానికి సంబంధించి ప్రపంచవ్యాప్త స్మార్ట్‌ఫోన్ అమ్మకాల పై ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్ళ గార్ట్‌నర్ గ్రూప్స్ విడుదల చేసిన తాజా నివేదిక టెక్ మార్కెట్‌ను స్వల్ప నిరాశకు లోను చేసింది. ఈ ఏడాది రెండవ క్వార్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా 41.9 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో 2వ క్వార్టర్ అమ్మకాలతో పోలిస్తే ఇది 2.3శాతం తక్కువ.

ఈ జూన్, క్వార్టర్‌కు సంబంధించి ఆపిల్, సామ్‌సంగ్‌లు తమ అమ్మకాలను అనూహ్యంగా పెంచుకున్నాయి. 2011 క్యూ2లో అగ్రగామి స్థానాన్ని దక్కించుకున్న నోకియా ఈ తడవ అంతగా ఆకట్టుకోలేకపోయింది. గార్ట్‌నర్ విడుదల చేసిన సమాచారం ప్రకారం... ఆపిల్ ఈ ఏడాది 2వ క్వార్టర్‌లో 28.94 మిలియన్ల ఐఫోన్‌లకు విక్రయించగలిగింది. గత ఏడాది క్యూ2లో ఆపిల్ కేవలం 19.63 మిలియన్ యూనిట్‌లను మాత్రమే విక్రయించగలిగింది. సామ్‌సంగ్ ఈ ఏడాది 2వ క్వార్టర్‌కు గాను 90.43 మిలియన్ల మొబైల్ ఫోన్‌లను విక్రయించగలిగింది. గత ఏడాది ఇదే సమయంలో 69.83 మిలియన్ల మొబైల్ ఫోన్‌లను మాత్రమే ఈ సంస్థ విక్రయించలిగింది. సామ్‌సంగ్ ఫోన్‌ల అమ్మకాలు పెరగటంతో గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌లు క్రీయాశీలక పాత్రపోషించాయి.

ఈ అంశం పై గార్ట్‌నర్ ప్రిన్సిపల్ అధ్యయన నిపుణుడు అన్షల్ గుప్తా స్పందిస్తూ ఆర్థిక వాతావరణం, అప్‌గ్రేడ్‌ల విషయంలో జాప్యత, ప్రమోషన్‌ల ఆలస్యం తదితర అంశాలు అమ్మకాల తగ్గుదలకు కారణంగా నిలిచాయని స్పష్టం చేశారు. ఆపిల్ నుంచి త్వరలో విడుదల కాబోతున్న ‘ఐఫోన్ 5’ అమ్మకపు వృద్థి రేటను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆపిల్, సామ్‌సంగ్ కేక... నోకియా ఢమాల్!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot