మొబైల్‌లో పోర్న్ వీడియోలు ఉండాలని ఏం చేస్తున్నారో తెలుసా ?

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. ఎక్కడికెళ్లినా అది ఉండాల్సిందే. సోషల్ మీడియా దగ్గర నుంచి అన్ని రకాల కార్యకలాపాలకు అది చాలా ముఖ్య సాధనం అయిపోయింది. అయితే ఆ ఫోన్లో మనకు కావాల్సినవన్నీ సేవ్ చేస్తుంటాము..దీని వల్ల స్టోరేజ్ సమస్య వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశంలో smartphone వాడకం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో.. ఓ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.smartphone వినియోగదారులు చాలా మట్టుకు స్టోరేజీ సమస్యతో సతమతమవుతున్నారంట. అలాంటి తరుణంలో ఏం చేయాలో తెలీక తమ వ్యక్తిగత ఫోటోలను.. వీడియోలను ఫోన్‌ నుంచి తొలగించేస్తున్నారు. అయితే ఈ క్రమంలో వారు అశ్లీల డేటా జోలికి వెళ్లడం లేదని సర్వే నిగ్గు తేల్చింది.

3జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 5,500 తగ్గింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొత్తం లక్ష మందిపై..

ప్రముఖ కంపెనీ సాన్‌డిస్క్‌ భారత దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మొత్తం లక్ష మందిపై ఈ సర్వేను చేపట్టింది. ఇందులో 29 శాతం స్మార్ట్‌‌ఫోన్‌ వినియోగదారులు వారానికొకసారి.. 62 శాతం మూడు నెలలకొకసారిగా తమ ఫోన్‌లోని మెమొరీని ఫ్రీ చేస్తున్నారు. అందులో ఉన్న సమాచారాన్ని తొలంగించి వేస్తున్నారట..

మొత్తంలో 65 శాతం మంది..

ఈ సర్వేలో పాల్గొన్న మొత్తంలో 65 శాతం మంది మాత్రం అందుకోసం తమ వ్యక్తిగత ఫోటోలను.. వీడియోలను తొలగించేస్తున్నట్లు వెల్లడించారు. వాటిని తొలగించాక చాలా బాధపడుతున్నట్లు వాళ్లు చెబుతున్నారు. విలువైన సమాచారాన్ని సైతం డిలీట్ చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారట.

విచిత్రకరమైన విషయం ఏంటంటే ..

అయితే ఇంకా విచిత్రకరమైన విషయం ఏంటంటే తమ ఫోన్‌లలోని పోర్న్‌.. అసభ్య ఫోటోలను జోలికి మాత్రం వాళ్లు వెళ్లట్లేదంట. వాటిని తీసివేయడానికి మనసు రావడం లేదట.. వాటికి బదులు.. తమ వ్యక్తిగత సమాచారాన్నే త్యాగం చేసేందుకు మొక్కు చూపుతున్నారని సర్వేలో తేలింది.

డేటాను తొలగించుకునే బదులు ..

అయితే డేటాను తొలగించుకునే బదులు వాటిని స్టోర్‌ చేసుకునే మార్గాలు ఉన్నాయి కదా అని శాన్‌డిస్క్‌ డైరెక్టర్‌ ఖలీద్‌ వానీ వినియోగదారులకు సూచిస్తున్నారు. ‘ఆ సమయంలో కంగారుపడి మెమొరీని తొలగించేస్తున్నారే తప్ప.. వాటిని మరో డివైస్‌లోకి బదిలీ చేయాలన్న ఆలోచన వారికి తట‍్టడం లేదని' ఆయన అంటున్నారు.

23-40 ఏళ్ల లోపు వాళ్లే..

ఈ సర్వేలో పాల్గొన్న వాళ్లలో 23-40 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువగా ఉండగా.. పోర్న్‌ ప్రస్తావన తెచ్చిన వాళ్లు 60 శాతం ఉండటం విశేషం. విధి విచిత్రమైనది అంటే ఇదేనేమో..కష్టపడి ఫోటోలు తీసుకుంటే వాటిని పోర్న్ వీడియోల కోసం డిలీట్ చేసేస్తున్న వారిని చూసి సర్వే అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

మొబైల్ లో డేటా ఉందంటే..

ఇక మొబైల్ లో డేటా ఉందంటే చాలామంది ముందుగా ఓపెన్ చేసేది ఆ వీడియోలే అన్నది చాలామంది ఒప్పుకోవాల్సిన విషయం. సోషల్ మీడియాలో ఉదయం నుంచి సాయంత్రం దాకా యాక్టివ్ గా ఉండటం అలాగే నైటు ఈ వీడియోల మీదకు మనసును కేంద్రీకరించడం చాలామంది చేస్తున్నారని దీని వల్ల వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indian mobile phone users regularly run out of space? Here is what SanDisk survey has found More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot