Home
Mobile

2019లో స్మార్ట్‌ఫోన్ నుంచి రాబోతున్న సంచలనాలు ఇవే !

ఈ ఏడాది మొబైల్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపింది. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ మాములు డిస్ ప్లే నుంచి నాచ్ స్క్రీన్ దాకా పరుగులు పెట్టింది. నాచ్ స్క్రీన్ ఈ ఏడాదిలో అతి పెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు.

ఈ ఏడాది మొబైల్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపింది. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ మాములు డిస్ ప్లే నుంచి నాచ్ స్క్రీన్ దాకా పరుగులు పెట్టింది. నాచ్ స్క్రీన్ ఈ ఏడాదిలో అతి పెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు. ఆపిల్ నుంచి షియోమి దాకా దాదాపు పాపులర్ కంపెనీలు అన్నీ ఈ నాచ్ స్క్రీన తో తమ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. డ్యూయెల్ కెమెరాలో కూడా ఈ ఏడాది అనేక సంచలనాలు నమోదయ్యాయి. ముఖ్యంగా బడ్జెట్ ధరకే డ్యూయెల్ కెమెరా ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఏడాది మరో కొద్ది రోజుల్లో బైబై చెప్పనుంది. మరి 2019లో మొబైల్ మార్కెట్లో ఏ సంచలనాలు నమోదు కాబోతున్నాయనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Multi camera phones

Multi camera phones

చైనా దిగ్గజం హువాయి ప్రపంచపు తొలి ట్రిపుల్ కెమెరా ఫోనన్ పీ20 ప్రొని మార్కెట్లోకి తీసుకువచ్చింది.అలాగే శాంసంగ్ కూడా క్వాడ్ కెమెరా ఫీచర్ తో గెలాక్సీ ఎ9ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే వచ్చే ఏఏాది రాబోతున్న స్మార్ట్ ఫోన్లలో దాదాపు 16 కెమెరాలు ఉండనున్నాయని సమాచారం. తొలిసారిగా నోకియా నుంచి రాబోతున్న నోకియా 9లో పెంటా రేర్ కెమెరా ఉండనుందని తెలుస్తోంది. అలాగే అమెరికా కంపెనీ కూడా 9 కెమెరాల ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది.

L16 అండ్ LG

L16 అండ్ LG

కాగా L16 అనే బుడ్డ ఫోన్ దాదాపు 16 సెన్సార్ కెమెరాలతో రానుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. L16 ద్వారా దాదాపు 52 ఎంపీ ఫోటోగ్రాప్స్ తీసుకోవచ్చట. అలాగే ఎల్ జి నుంచి 16 కెమెరాల ఫోన్ వచ్చే ఏడాది రానుందనే వార్తలు వస్తున్నాయి.

ఫోల్డబుల్ ఫోన్స్

ఫోల్డబుల్ ఫోన్స్

హువాయి ఈ విషయంలో ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే శాంసంగ్ స్థానాన్ని ఆక్రమించిన ఈ కంపెనీ కొత్త ఫోన్ తో అనేక సంచలనాలు నమోదు చేయనుందని వార్తలు వస్తున్నాయి. దీన్ని పసిగట్టిన శాంసంగ్ కొత్త ఎత్తుగడతో పోల్డబుల్ ఫోన్ ని మార్కెట్లోకి వచ్చే ఏడాది తీసుకురానుంది.

 

 

7.3-inch screen

7.3-inch screen

శాంసంగ్ నుంచి రానున్న Galaxy X or F ఫోన్లో అవుట్ సైడ్ 4.6-inch display అలాగే 7.3-inch screen ఉండనుందని సమాచారం. కాగా ఇది ఫోల్డబుల్ ఫోన్ అంటూ అనేక రకాలైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే హువాయి నుంచి కూడా 5జీ ఫోన్ వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది.

Pop-up Camera Phones

Pop-up Camera Phones

చైనా ఫోన్ మేకర్స్ Vivo and Oppo కంపెనీలు వచ్చే ఏడాది పాప్ అప్ కెమెరాో తమ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. Find X and Vivo Nexలతో ఇప్పటికే సంచలనం రేపిన ఈ కంపెనీలు వచ్చే ఏడాది సరికొత్తగా ఫోన్లను తీసుకురానున్నాయి. Xiaomi, Honor and Lenovo లాంటి కంపెనీలు కూడా స్లైడర్ ఫోన్ మీద తమ దృష్టిని నిలిపాయి.

 

 

Screen With A Hole

Screen With A Hole

notch-screen designతో మార్కెట్లో ఇప్పటికే సంచలనం రేపిన ఫోన్ మేకర్స్ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. నాచ్ అండ్ పాప్ అప్ మెకానిజంతో కొత్తగా వచ్చే ఏడాది ఫోన్లు కనువిందు చేయనున్నాయి. దిగ్గజాలు శాంసంగ్, ఆపిల్, గూగుల్ కంపెనీలు ఈ ఫోన్ల మీద పూర్తి స్తాయిలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
Smartphone Trends To Watch Out For In 2019 more News at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X