పెట్రోల్ బంక్‌లో ఫోన్ ఎందుకు వాడకూడదు?

అన్ని పెట్రోల్ బంకుల్లో సెల్‌ఫోన్‌లు వాడకూడదనే హెచ్చరిక బోర్డులు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే, సెల్‌ఫోన్ కారణంగా పెట్రోల్ బంకుల్లో ప్రమాదాలు సంభవించిన ఘటనలు చాలా తక్కువే అని చెప్పాలి. నమోదైన సంఘటనల్లో కూడా ప్రమాదానికి సెల్‌ఫోన్‌ ఎంత వరకు కారణమనేది స్ఫష్టత లేదు. వాస్తవంగా చిన్న రాపిడికి సైతం పెట్రోల్ స్పందించగలదు.

పెట్రోల్ బంక్‌లో ఫోన్ ఎందుకు వాడకూడదు?

Read More : ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధర లోపు)

ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తగా పెట్రోల్ బంక్ యాజమాన్యం ఈ తరహా హెచ్చరికులను జారీ చేస్తుంది. పెట్రొల్ బంక్‌లో ఫోన్ ఎందుకు ఉపయోగించుకోడదనే అంశం పై చాలా మందిలో అనేక సందేహాలు మెదులుతున్నాయి. ఈ డిబేటబుల్ ఇష్యూకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను గిజ్‌‌‌‌‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

two-way కమ్యూనికేషన్

మొబైల్ ఫోన్‌ల నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలు ఫోన్‌కు టవర్‌కు మధ్య two-way కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి.

మెటల్ ఆబెక్ట్స్ పై ప్రభావం

ఈ తరంగాల నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ హైఎనర్జీని క్యారీ చేయటం వల్ల మెటల్ ఆబెక్ట్స్ పై ప్రభావం ఉంటుంది.

చిన్న రాపిడికి సైతం

చిన్న రాపిడికి సైతం స్పందించగల పెట్రోల్‌ను సెల్‌ఫోన్ ద్వారా వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ ప్రభావితం చేయగలదని నిపుణులు భావిస్తున్నారు.

దెబ్బతిన్న బ్యాటరీతో...

మొబైల్ ఫోన్‌లు బ్లాస్ట్ అవటానికి బ్యాటరీనే ప్రధాన కారణం. ఉబ్బిన లేదా దెబ్బతిన్న బ్యాటరీతో ఫోన్‌ను వాడటం చాలా ప్రమాదకరం. ఇవి ఎప్పుడైనా పేలు అవకాశముంటుంది కాబట్టి పెట్రోల్ బంకుల్లోకి వీటిని తీసుకెళ్లకండి.

సెల్‌ఫోన్ కారణంగా

సెల్‌ఫోన్ కారణంగా పెట్రోల్ బంకుల్లో ప్రమాదాలు సంభవించిన ఘటనలు ఇప్పటివరకు చాలా తక్కువగానే నమోదయ్యాయి. నమోదైన సంఘటనల్లో కూడా ప్రమాదానికి సెల్‌ఫోన్‌ ఎంత వరకు కారణమనేదాని పై స్ఫష్టత లేదు.

మెదడుకు ముప్పు..?

మొబైల్ ఫోన్‌లు కొంత మేర వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రభావం మెదడును తాకే అవకాశముంది. కాబట్టి మొబైల్ ఫోన్‌‍ను మితంగా ఉపయోగించటం మంచిది కాదు.

మొబైల్ వినియోగం క్యాన్సర్‌కు దారితీస్తుం ?

మొబైల్ వినియోగం క్యాన్సర్‌కు దారితీస్తుందా అనే అంశానికి సంబంధించి బలుమైన రుజువులు ఇప్పటికి దొరకలేదు. ఈ అంశానికి సంబంధించి పరిశోధనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా సెల్‌ఫోన్‌లను అవసరం మేరకు వినియోగించుకోవటం మంచిది. ముఖ్యంగా డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలి.

సెల్‌ఫోన్‌లను ప్యాంట్ జేబులలో...

సెల్‌ఫోన్‌లను ప్యాంట్ జేబులలో పెట్టుకోవటం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గి ఆ ప్రభావం మగతనం పై తీవ్రంగా చూపే అవకాశముందని పలు పరిశోధనలు ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిశోధనలకు బలం చేకూర్చే రుజువులకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
FACT OR MYTH: Here's Why You Can't Use A Smartphone in a Petrol/Gas Station!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot