అవి పాటించకుండా మొబైల్‌లో నెట్ వాడుతున్నారా..?

వెబ్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో తీసుకోవల్సిన కనీస జాగ్రత్తలు...

|

కనీస జాగ్రత్తలు లేకండా చేసే మొబైల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయటమనేది ప్రైవసీ సమస్యలకు దారి తీసే ప్రమాదముందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ విషయంలో కనీస అవగాహన తప్సనిసరి. వెబ్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో తీసుకోవల్సిన కనీస జాగ్రత్తలను ఇప్పుడు తెలుసకుందాం..

Read More : ఒక్కొక్కరికి 168జీబి డాటా, వివో ఫోన్‌ల పై జియో సంచలనం

బ్రౌజర్‌ యాప్‌‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోండి.

బ్రౌజర్‌ యాప్‌‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోండి.

ఫోన్‌లో బ్రౌజర్‌ యాప్‌‌ను అప్‌గ్రేడ్ చేయకుండా బ్రౌజింగ్ చేయకండి. బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం వల్ల ఎర్రర్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాకుడా బ్రౌజంగ్ మరింత వేగవంతంగా ఉంటుంది.

 కుకీల విషయంలో జాగ్రత్త..

కుకీల విషయంలో జాగ్రత్త..

ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు యూజర్‌ ఎంచుకున్న ప్రిఫరెన్సులను గుర్తుంచుకోవడానికి కుకీస్ ఉపయోగపడతాయి. కాబట్టి కుకీలను అవసరం మేరకే అనుమతించండి. మీరు కుకీలను అనుమతించిన పక్షంలో కొన్ని వెబ్‌సైట్‌లు మీ బ్రౌజర్‌లో ఓపెన్ కావు.

పాస్‌వర్డ్స్ విషయంలో జాగ్రత్త...
 

పాస్‌వర్డ్స్ విషయంలో జాగ్రత్త...

బ్రౌజ్ చేస్తున్న సమయంలో మీరు ఉపయోగించే అన్ని ఆన్‌లైన్ అకౌంట్‌లకు ఒకటే పాస్‌వర్డ్‌ను సెట్ చేయకండి. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. పొరపాటున మీ సింగిల్ పాస్‌వర్డ్ ఇతర వ్యక్తులకు తెలిస్తే తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, ఒక్క అకౌంట్‌కు ఒక్కో రకమైన పాస్‌వర్డ్‌ను చేసుకోండి.

బ్రౌజర్ వేగం మందగించకుండా..

బ్రౌజర్ వేగం మందగించకుండా..

మీ బ్రౌజర్‌కు ఎక్కువ సంఖ్యంలో ప్లగిన్స్ లేదా ఎక్స్‌టెన్సన్‌లను జోడించటం వల్ల బ్రౌజర్ వేగం మందగిస్తుంది. కాబట్టి అనవసరమైన ప్లగిన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

"https"తో ప్రారంభమయ్యే...

 "https"తో ప్రారంభమయ్యే యూఆర్ఎల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. మీకు తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌‍ను ఏ మాత్రం క్లిక్ చేయవద్దు. ఒకవేళ ఆ యూఆర్ఎల్ మీ మిత్రుని ద్వారా వచ్చినట్లయితే ఒకసారి అతనిని అడిగి విషయం ఏంటో తెలుసుకోండి.

ఆటోమెటిక్ నెట్‌వర్క్ కనెక్ట్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోండి..

ఆటోమెటిక్ నెట్‌వర్క్ కనెక్ట్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోండి..

మీ ఫోన్‌లోని ఆటోమెటిక్ నెట్‌వర్క్ కనెక్ట్ ఆప్షన్‌ను డిసేబుల్ ఎప్పటికప్పుడు చేసి ఉంచండి. ఇలా చేయటం వల్ల మీ ఫోన్ ఎక్కడపడితే అక్కడ ఇతర డివైజ్ లతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు.

యాప్స్ విషయంలో జాగ్రత్త..

యాప్స్ విషయంలో జాగ్రత్త..

మీరు డౌన్‌లోడ్ చేసుకునే అప్లికేషన్‌లకు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్‌లను ముందుగా నిశితంగా పరిశీలించుకుని ఆ తరువాత ప్రొసీడ్ అవ్వండి.

Best Mobiles in India

English summary
Smartphone users need to be careful while Internet Browsing. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X