ఫోన్‌ను అలా చూడకండి, కంటి చూపు పోతుంది..?

చీకట్లో ఎక్కువుగా తమ ఫోన్‌లను చెక్ చేసుకోవటం ద్వారా ఇద్దరు మహిళలు తాత్కాలికంగా కంటిచూపును కొల్పోవల్సి వచ్చింది. ఈ ఘటనతో షాక్ అయిన డాక్టర్లు ఇటువంటి అలవాట్లను పూర్తిగా మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు, పడుకునే సమయంలోనూ ఫోన్‌లను విడిచిపెట్టరు. వీళ్లు చీకటి వాతవరణంలోనూ ఫోన్ స్ర్కీన్‌ల వైపు తధేకంగా చూస్తూ కళ్లను తీవ్రమైన ఒత్తిడికి లోనుచేసేస్తుంటారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వైద్యులనే షాక్ అయ్యేలా చేసిన కేసు

వైద్యులనే షాక్ అయ్యేలా చేసిన ఈ వింత కేసుకు సంబంధించిన వివరాలు గురువారం విడుదలైన న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసెన్‌ వీక్లీలో పోస్ట్ అయ్యాయి.

ఒక కంటితో మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లను చూడటం ద్వారా ..

ఈ మహిళలు చీకట్లో ఒక కంటితో మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లను చూడటం ద్వారా "transient smartphone blindness"ను ఫేస్ చేయవల్సి వచ్చందని వైద్యుల పరిశీలనలో వెల్లడైంది.

 

తరచూ వీళ్లు 15 నిమిషాల పాటు చూపును కోల్పోతున్నారు..

తరచూ వీళ్లు 15 నిమిషాల పాటు చూపును కొల్పోతుండటంతో తొలత వైద్యులు వీళ్లకు అనేక వైద్య పరీక్షలను నిర్వహించారు. వాటిలో ఎంఆర్ఐ స్కాన్స్‌తో పాటు హార్ట్ టెస్ట్‌లు కూడా ఉన్నాయి. సమస్యకు గల కచ్చితమైన కారణాలు వెల్లడికాకపోవటంతో వీళ్లను కంటి చూపు నిపుణుల వద్దకు తీసుకువెళ్లారు.

స్మార్ట్‌ఫోన్ అలవాట్లను తెలుసుకుని..

లండన్‌లోని మూర్ఫీల్డ్ ఐ హాస్పిటల్ నిపుణులు వీళ్ల స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సంబంధించిన అలవాట్లను తెలుసుకుని నిమిషాల్లో సమస్యకు పరిష్కారం రాబట్టారు.

ఒక కన్నతో మాత్రమే స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌ను చూస్తున్నట్లు గుర్తించారు...

వీళ్లు రాత్రుళ్లు పడుకునే సమయంలో ఒక కన్నతో మాత్రమే స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌ను చూస్తున్నట్లు గుర్తించారు. వీళ్లు ఒకవైపు తిరిగిపడుకోవటంతో, ఫోన్ చూస్తోన్న నసమయంలో ఒక కన్ను మాత్రమే ఫోన్ స్ర్కీన్‌ను చూస్తోంది. మరొక కన్నుకు దిండు అడ్డుగా ఉండటంతో ఆ కన్ను చీకటి వాతావరణాన్ని చూడవల్సి వస్తోంది.

ప్రతిసారి ఇలా జరుగుతుండటం వల్ల..

ప్రతిసారి ఇలా జరుగుతుండటం వల్ల వాళ్లకు తాత్కాలిక అంధత్వం సంభవిస్తోందని వైద్యులు తేల్చారు. కాబట్టి, రాత్రుళ్లు ఫోన్ స్ర్కీన్‌లను చూసేటపుడు రెండు కళ్లు స్ర్కీన్‌ను చూసే విధంగా పడుకోవలని వైద్యులు చెబుతున్నారు.

రోజు మొత్తం మీద 150 సార్లు తన ఫోన్ స్ర్కీన్ వైపు...

ఓ సర్వే ప్రకారం సగటు స్మార్ట్‌ఫోన్ యూజర్ రోజు మొత్తం మీద 150 సార్లు తన ఫోన్ స్ర్కీన్ వైపు చూస్తాడట. స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌లను అస్తమానం చూస్తూ ఉండటం వల్ల కళ్లు మరింత ఒత్తిడిని ఎదుర్కొవల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

డిస్‌ప్లే బ్రైట్నెస్‌ను అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా

ఫోన్ డిస్‌ప్లే బ్రైట్నెస్‌ను లైటింగ్‌కు‌ అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కాంతికి అనుగుణంగా ఫోన్ బ్రైట్నెస్‌ను అడ్జస్ట్ చేసే యాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

దూరంగా ఉంచి చూడటం మొదలు పెట్టండి

స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా ఉంచి చూడటం మొదలు పెట్టండి. ఫోన్ తెరకు మీ కంటికి కనీసం 15 అంగుళాల దూరమైనా ఉండేలా చూసుకోండి.

ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోండి

స్ర్కీన్ ముందు నిరంతరాయంగా పనిచేస్తున్న సమయంలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోండి. తరచూ కళ్లను బ్లింక్ చేయటం వల్ల కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

రీడింగ్ గ్లాస్‌‌ను దరించండి..

స్మార్ట్‌ఫోన్‌ను సుధీర్ఘంగా వినియోగించాల్సి వస్తే రీడింగ్ గ్లాస్‌‌ను దరించండి. లేని పక్షంలో మీ మొబైల్‌కు యాంటీ గ్లేర్ కోటింగ్స్‌ను వేయించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphone users temporarily blinded after looking at screen in bed. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot